Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Kids distribute water: మండుటెండలో నీళ్ల సీసాలు పంపిణీ చేస్తున్న బాలుడు..!

Kids distribute water: పొట్టకూటి కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్న కొందరిని చూసిన ఓ బాలుడి... మనసు కరిగిపోయింది. చల్లని మంచి నీళ

By Vinod Kumar

Published on: May 3, 2022 6:57 PM

Updated on: May 3, 2022 6:57 PM

---Advertisement---

Kids distribute water: పొట్టకూటి కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్న కొందరిని చూసిన ఓ బాలుడి… మనసు కరిగిపోయింది. చల్లని మంచి నీళ్ల సీసాలు కొని వారికి అందించి తన ఉదారతను చాటుకున్నాడు. పూలు, పండ్లు అమ్ముకుంటూ బ్రతుకీడుస్తున్న వారిని దేవుడిలా ఆదుకున్నాడు. అయితే అంత ఎండలో చల్లని నీళ్లను అందించడతో ఓ వృద్ధురాలు మనసారా దీవించిందా బాబును. అయితే ఆ బాలుడు నీళ్లు పంచుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా… చూసిన వారంతా బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

one old boy distributed water bottles in streets

Advertisement

తన కోసం చల్లటి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన ఆ బాలుడిని ఒక వృద్ధురాలు మనసారా ఆశీర్వదించింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా… బాలుడి ఔదార్యాన్ని చూసి నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ఎండలో మండుతున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :