Sarkaru vari pata trailer record: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్..!

Sarkaru vari pata trailer record: సూపర్ స్టార్ మహేశ్ ​బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. అయితే చిత్ర బృందం నిన్న అంటే మే 2వ తేదీన ట్రైలర్​ విడుదల చేసింది. అయితే ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే.. 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్​లో నెం.1 స్థానంలో ట్రెండ్​ అవుతోంది. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ ట్రైలర్ లో మిల్క్ బాయ్ మాస్ లుక్స్, ఆయన డైలాగ్స్ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి.

ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పరుశరామ్ దర్శకత్వం వహించగా… కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel