Niharika Chaitanya : మెగా అల్లుడు హీరోగా ఎంట్రీ.. అసలు క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Updated on: July 28, 2022

Niharika Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే వారు అవుతుంటే కొత్తగా వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలు అవుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన హీరో ఎవరైనా కొత్తగా కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు వారి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మొన్నటిదాకా వివాదాల్లో చిక్కుకున్న మెగా ఫ్యామిలీ కొత్త జంట అయిన నాగబాబు ముద్దుల కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Niharika's husband Chaitanya Jonnalagadda gives clarity on acting debut in Tollywood
Niharika’s husband Chaitanya Jonnalagadda gives clarity on acting debut in Tollywood

నిహారిక తో పెళ్లి తర్వాత ఆమె భర్త చైతన్య హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని లేదా ప్రొడ్యూసర్ గా అయిన సినిమాలు చేసే అవకాశం ఉందని పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఈ జంట మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. కానీ వీరిద్దరు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.

Niharika Chaitanya : వెంకట చైతన్య సినిమాల్లోకి వస్తున్నాడా?   

అయితే వీరిలో ఎవరు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే చైతన్య సినిమాల్లోకి వస్తున్నాడనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై చైతన్య స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్ లో తను చాలా హ్యాపీగా ఉన్నానని తనకు యాక్టింగ్ అంటే నచ్చదని యాక్టర్ అవ్వడం ఇష్టం లేదని ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చైతన్యకు సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఇకనైనా ఈ రూమర్స్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. ఇక ఈ విషయం గురించి స్పష్టత రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Read Also : Niharika Konidela : తల్లి కాబోతున్న నిహారిక.. మేం ముగ్గురం అంటున్న మెగా డాటర్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel