Major Movie Review : ’మేజర్‘ మూవీ ఫుల్ రివ్యూ.. ప్రతి భారతీయుడిని కదిలించే సినిమా..!

Updated on: June 5, 2022

Major Movie Review : ఒక సైనికుడిగా ఉండాల్సింది ముఖ్యంగా.. మంచి కొడుకు లేదా గొప్ప భర్త కావడం కాదు.. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయగల గొప్ప సైనికుడిగా ఉండాలి. ప్రతి సైనికుడు తన తల్లితండ్రులతో పాటు భార్యాపిల్లలను విడిచిపెట్టి.. దేశ గౌరవం కోసం పోరాడుతాడు. ఇది ఎంత కష్టమో బహుశా సామాన్యుడు కూడా ఊహించలేడు. తన దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధం చేసేందుకు వెళ్లిన సైనికుడు తిరిగి వస్తాడో లేదో.. కానీ ఆ సైనికుడు ఎప్పుడూ ఎప్పటికీ ప్రతి భారతీయ పౌరుడి గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉండిపోతాడు. అలాంటి సైనికుడు ఎప్పుడూ మృత్యువు కళ్లలోకి చూస్తూ ‘నువ్వు నా ప్రాణాన్ని తీయగలవు ఏమో కానీ.. నా దేశాన్ని కాదు అంటూ శత్రువులకు ధైర్యంగా ఎదురు నిలబడతాడు. అలాంటి నేపథ్యంలో సాగే మూవీతో మన మేజర్ అడవి శేష్ జూన్ 3న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు.

Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review
Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review

ఈ మూవీపై సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ కనిపిస్తోంది. ఈ శుక్రవారం ఏకంగా థియేటర్లలో ఇతర సినిమాలతో గట్టి పోటీనిస్తున్నాడు అడవి శేష్.. జూన్ 3న అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, కమల్ హాసన్ ‘విక్రమ్’ తో పాటు అడివి శేష్ ‘మేజర్’ భారీ స్క్రీన్‌పై రిలీజ్ అవుతున్నాయి. మన ‘మేజర్’ మూవీ ఎలా ఉందో రివ్యూ చూద్దాం..

Major Movie Review :  మేజర్ మూవీ నేపథ్యం..

ముంబయి దాడి 26/11 ఆధారంగా తెరకెక్కింది. అడివి శేష్ ‘మేజర్’ మూవీతో ముంబై దాడి 26/11 భయానక దృశ్యం మరోసారి కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఈ సినిమాలో అడవి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 26 నవంబర్ 2008, కరాచీ మీదుగా పడవలో ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దాడి చేసిన తేదీ ఇది..

Advertisement
Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review
Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review

26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివి శేష్ నటించారు. సందీప్ తన జీవితం గురించి పట్టించుకోకుండా దేశం కోసం తీవ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా సాగడాన్ని సినిమాలో బాగా చూపించారు. సందీప్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నాడు. ఒక సైనికుడు మరణాన్ని కూడా నవ్వుతూ ఎలా స్వీకరించాడు? అనేది సినిమాలోని ఒక డైలాగ్‌లో దీనికి సమాధానం ఉంది. సినిమాలో ఒక చోట, సందీప్ ‘మీ జీవితం గురించి పట్టించుకోకండి, మీ జీవితాన్ని ఎప్పుడైనా రిస్క్ చేయండి, మీ దేశానికి మొదటి స్థానం ఇవ్వండి. అది సైనికుడి జీవితం.. అంటాడు.

ఈ సినిమాలో మేజర్ చిన్నప్పటి జీవితం, కాలేజ్ లైఫ్, మరెన్నో అంశాలను చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ మేజర్ పర్సనల్ లవ్ స్టోరీనే కనిపించనుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ సందీప్ ఉన్నికృష్ణన్ సైనిక జీవితం ఆయన పోరాట పటిమ ఇలా అంతా ఉద్వేగంతో కథ ముందుకు సాగుతుంది.

Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review
Major Movie Review : Adivi Sesh Stunning Performance with Action Full Movie Review

ఈ డైలాగ్ వింటే కన్నీళ్లు ఆగవు :
సినిమాలోని ఒక్కో డైలాగ్ ప్రతిఒక్కరిని కదిలిస్తుంది. సినిమా కథాంశం, పాట నుంచి డైలాగ్ వరకు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పలు భాషల్లో రూపొందిన ‘మేజర్’ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హస్తం కూడా ఉంది. 120 రోజుల్లో 75 లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.

Advertisement

బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ మెప్పిస్తాడా? :
ఒకే రోజున మూడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. అడవి శేష్‌కు ప్రేక్షకుల నుండి ఎంత వరకు ఆదరణ లభిస్తుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. బాక్సాఫీసు వద్ద ఈ మూడు సినిమాలు ఢీకొంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బిజినెస్‌పై కూడా భారీ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మేజర్ మూవీ తొలిరోజున 15 కోట్ల నుంచి 20 కోట్లు వరకు రాబట్టవచ్చని అంచనా.. మేజర్‌గా అడవి శేష్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

రివ్యూ : మేజర్
స్టార్ రేటింగ్: 3/5
దర్శకుడు: శశి కిరణ్ తిక్క

Read Also : Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel