Mahesh Babu Six Pack : మిల్క్ బాయ్ మహేష్‌.. ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. స్విమ్మింగ్ పూల్లో సిక్స్ ప్యాక్ లుక్..!

Mahesh Babu Six Pack : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ సక్సెస్ ని సొంతం చేసుకోవడంలో ఆయన తన ప్రత్యేకత చాటుకుంటూనే వస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఎక్కువగా కమర్షియల్ యాడ్ చేస్తున్న ఏకైక హీరో మహేష్ బాబు. మన హీరోలందరూ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వాళ్ల సిక్స్ ప్యాక్ చూపిస్తూ సినిమాల్లో తెగ సందడి చేస్తున్నారు.

Mahesh Babu Six Pack Look with out Shirt in Swimming Pool Photo Viral on Social Media
Mahesh Babu Six Pack Look with out Shirt in Swimming Pool Photo Viral on Social Media

కానీ మహేష్ బాబు మాత్రం దానికి ఎప్పుడు భిన్నంగా ఉంటున్నారు. ఇక ఎప్పుడూ తన సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించలేదు. నేనొక్కడినే మూవీ లో బ్యాక్ సైడ్ నుండి కనిపించారు. అలాంటిది తొలిసారి మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించడం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది సర్కారు వారి పాట చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్న మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Mahesh Babu Six Pack : ప్రిన్స్ మీస కట్ పిక్.. ఇప్పుడు సిక్స్ ప్యాక్ లుక్..!

Mahesh Babu Six Pack Look with out Shirt in Swimming Pool Photo Viral on Social Media
Mahesh Babu Six Pack Look with out Shirt in Swimming Pool Photo Viral on Social Media

ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. కాస్త మీసాలు పెంచి సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నారు. మొన్న మీసకట్టు లుక్ విడుదల చేయగా ఇప్పుడే ఈ సిక్స్ ప్యాక్ లుక్ బయటకు వచ్చింది. అయితే అసలు ఈ షర్ట్ లెస్ ఫోటో ని పోస్ట్ చేసింది ఎవరో కాదు ఆయన సతీమణి నమ్రత.

Advertisement

ఆయన స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోని ఆమె షేర్ చేసింది. ఇక ఫోటో లో సిక్స్ ప్యాక్ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కనిపించబోయే సినిమాలో మహేష్ తన సిక్స్ ప్యాక్ ని చూపించడం ఖాయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also : Ram Charan-Upasana : చరణ్, ఉపాసన వరలక్ష్మి వ్రతం చూశారా? కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel