Sarkaru vaari pata: సర్కారు వారి పాట డిజాస్టర్ అంట… తప్పు చేశారంటున్న నెటిజెన్లు!

Sarkaru vaari pata: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోని డిజాస్టర్ సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మోత్సం సినిమా సీరియల్ ను తలపించిందంటూ… నెటిజెన్లు విపరీతమైన నెగటివ్ కామెంట్లు చేశారు. అయితే సర్కారు వారి పాట సినిమాలోని సెకండాఫ్ ను చూసిన ప్రేక్షకులు బ్రహ్మోత్సవం సినిమాతో పోలుస్తున్నారు. సినిమా చాలా రొటీన్ గా ఉందని… ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అస్సలే లేవని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లు అబిమానులను సైతం హర్ట్ చేస్తున్నాయి. మహేశ్ బాబు అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు.

మహేష్ హీరోగా తెరకెక్కిన సినిమా రెండున్నరేళ్ల తర్వాత విడుదల కాగా.. ఈ సినిమా నిరాశ పరచడం అభిమానులను బాధిస్తోంది. భారీగా అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళ్తే… సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేశ్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే దర్శకుడు పరశురాం సద్వినియోగం చేసుకోలేదని నెటిజెన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel