Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Love Movie : డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చిందే లవ్ సినిమా : నాగ్ అశ్విన్

Love Movie : విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు '@లవ్' అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది అని టాక్ న

By Ramesh Babu

Published on: December 1, 2022 10:52 AM

Updated on: December 1, 2022 10:52 AM

Love Movie _ at love telugu movie is tribal drama, says nag ashwin

---Advertisement---

Love Movie : విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి.  ఇప్పుడు  ‘@లవ్’ అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉందని.. మరో వినూత్న సినిమాగా నిలుస్తోందని తెలుస్తోంది.  శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  ఫస్ట్ లుక్ ను   టాలెంటెడ్ డైరెక్టర్  నాగ్ అశ్విన్  లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.   గిరిజన నేపథ్యంలో  స్వచ్ఛమైన ప్రేమ కథతో  రాబోతున్న ఈ సినిమా  తనను ఎంతగానో ఆకట్టుకుందని.. నాగ్ అశ్విన్  చెప్పారు.

Love Movie _ at love telugu movie is tribal drama, says nag ashwin
Love Movie _ at love telugu movie is tribal drama, says nag ashwin

‘మంచి సినిమా రావడం  లేదు అని బాధ పడేవారికి  ఈ సినిమా మంచి ఆప్షన్.  గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే  సినిమా ఇది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు  దర్శకుడు శ్రీ నారాయణ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.  రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని  ఈ సినిమాలో శ్రీ నారాయణ చూపించిన విధానం అద్భుతంగా ఉందట.

Advertisement

ముఖ్యంగా  ఈ @లవ్ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక  కథ ఉందని.. ప్రతి పాత్రకు ఓ ఎమోషన్ ఉందని.. ప్రతి ఎమోషన్ కథను డ్రైవ్ చేస్తోందని చెబుతున్నారు. అసలు ఇలాంటి ప్రేమ కథలో  అద్భుతమైన ఎమోషన్స్ ను పెట్టడం నిజంగా అద్భుతం. మొత్తానికి ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుందట.  ఇక ఈ చిత్రాన్ని TMS బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు. డిసెంబర్ లో రానున్న ఈ  @లవ్  ప్రేక్షకులను ఆకర్షించే చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.