Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Pooja Hegde: F3 లో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన పూజ హెగ్డే.. ప్రోమో వైరల్!

Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. ఇటీవల ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను కొంచెం నిరాశ పరిచాయి. అయినా ఈ అమ్మడు తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పూజా హెగ్డే కథానాయిక పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడ చేసింది. ఈ సినిమాలో ” జిగేలు రాణి” ... Read more

By Ramesh Babu

Published on: May 18, 2022 12:12 PM

Updated on: May 18, 2022 11:18 AM

---Advertisement---

Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. ఇటీవల ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను కొంచెం నిరాశ పరిచాయి. అయినా ఈ అమ్మడు తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పూజా హెగ్డే కథానాయిక పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడ చేసింది. ఈ సినిమాలో ” జిగేలు రాణి” పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుణ్ తేజ్, వెంకటేష్ నటిస్తున్న F3 సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

F2 సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న F3 సినిమాకి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి మరొక పాటను సినిమా యూనిట్ విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. “అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా” అంటూ సాగిపోయే ఈ పాట ద్వార జీవితాన్ని ఎలా అనువించాలో తెలియచేశారు.

కాసర్ల శ్యామ్ రచించిన పిట్టగోడపై పెట్టే సరదా ముచ్చట్లు చైనా వాల్ పై పెట్టుకుందాం. ” అయ్యగారి కొట్టులో కొట్టే ఛాయ్ పక్కనెట్టి ఈఫిల్ టవర్ పై ఐస్ టీ కొట్టెద్దాం ” అంటూ సాగిపోయే ఈ పాట ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమకి మే 27 వ తేదీన ప్రేక్షకులని అలరించటానికి సిద్దంగా ఉంది.ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.