Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Karte kalyani: యూట్యూబర్ శ్రీకాంత్ ని అందుకే కొట్టానంటూ కరాటే కళ్యాణి కామెంట్లు.. ఏమైందంటే?

Karte kalyani: సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే కూడా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయ

By Vinod Kumar

Published on: May 17, 2022 9:58 AM

Updated on: May 17, 2022 9:58 AM

---Advertisement---

Karte kalyani: సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే కూడా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె యూట్యూబర్ శ్రీకాంత్ ను రోడ్డుపై పడేసి కొట్టింది. గుడ్డలూడదీసి మరీ పరుగులు పెట్టిస్తూ… తన్నింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రాగా… ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అతడు వీడియోలు తీస్కుంటుంటే మీకేమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ తనతో అసభ్యంగా మాట్లాడినందుకు, తనను తాకినందుకే కొట్టానని ఆమె వివరించే ప్రయత్నం చేశారు.

Karate kalyani shocking comments on youtuber srikanth

Advertisement

అయితే తాజాగా దీనిపై మరోసారి స్పందించారు. తన తమ్ముడు ఇళ్లు షిఫ్టు అవుతుంటే తాను యూసుఫ్ గూడ వెళ్లానని… ఈ క్రమంలోనే అక్కడ తనను ఓ అమ్మాయి కలిసిందని కరాటే కళ్యాణి తెలిపారు. అయితే ఈ అమ్మాయితో వీడియోలు తీసిన శ్రీకాంత్… ఆమె వీడియోలను డిలీట్ చేయమంటే చేయట్లేదని తనతో చెప్పినట్లు వివరించింది. మీరు బెదిరించి ఆ వీడియోలు డిలీట్ చేయించండి అని ఆ అమ్మాయి చెప్తేనే.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లినట్లు వెల్లడించింది. అక్కడే అతను తనతో అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది. అందుకే అతనిపై చేయి చేసుకున్నానని వివరించింది. ఇలాంటి వీడియోలు తీస్తూ.. మహిళలను ఇబ్బందులు పెట్టే వారెవరినీ వదలనంటూ స్పష్టం చేసింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.