Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Major movie amma song: మేజర్ సినిమా నుంచి అమ్మ పాట విడుదల.. అదిరిందంటూ కామెంట్లు!

Major movie amma song: ముంబై ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఈ చత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రంపై పలువురు సినీ, ... Read more

By Vinod Kumar

Published on: June 21, 2022 7:26 PM

Updated on: June 21, 2022 7:26 PM

---Advertisement---

Major movie amma song: ముంబై ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఈ చత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలంటూ కితాబిస్తున్నారు. అయితే చాలా మంది ఈ సినిమాను చూసి ఎమోషనల్ అవుతున్నారు.

Advertisement

మేజర్ కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా ఈ చిత్ర బృందం నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. కన్నా కన్నా అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్న కృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలు దేరే సన్నివేశాలను చూపించారు. అయితే రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా… ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియోన నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేసేయండి.

 

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.