Suma: సుమ పరువు మొత్తం తీసేసిన జోగి బ్రదర్స్.. ఆమెకు రాత్రి అంతా అదే పనంటూ కామెంట్స్!

Updated on: May 29, 2022

Suma:ప్రతి శనివారం ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ సుమ పై పంచ్ వేయగా సుమ కూడా వారిపై తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటులు కాదంబరి కిరణ్, రాగిణి, జోగి నాయుడు, కృష్ణంరాజు గెస్టులుగా వచ్చారు.

వీరందరితో కలిసి సుమ చేసిన హంగామా మామూలుగా లేదు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జోగి బ్రదర్స్ సుమ పరువు మొత్తం తీసేసారు. ఈ క్రమంలోనే సుమా పంచులు అనుకుని వేస్తుందా? అప్పటికప్పుడు వేస్తుందా అని అని జోగి నాయుడు అడగ్గా.. కృష్ణంరాజు ‘సుమ అస్సలు పడుకోదు. రాత్రంతా పంచులన్నీ ప్రాక్టీస్ చేసి.. వేస్తది మనం వాటిని నేర్చుకోలేం అంటూ బాంబు పేల్చాడు. ఈ విధంగా జోగి బ్రదర్స్ క్యాష్ కార్యక్రమంలో భాగంగా సుమ పై పంచ్ డైలాగులు వేస్తూ పరువు మొత్తం తీశారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా యాక్టర్ సమీర్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.అరేయ్.. సమీర్‌ ఈ క్యాష్ షోకు కాంట్రాక్టర్‌ అని తెలుసా?’ అని అడగగా ఏదీ మన సమీరా? అసలు ఎందుకు వస్తున్నాడో తెలుసా తనకు డబ్బులు ఇవ్వాలని ఏదో ఒక రోజు సుమ తనకు తప్పకుండా డబ్బులు ఇస్తుందని క్యాష్ కార్యక్రమానికి వస్తున్నాడు అంటూ మరో సారి సుమ గురించి మాట్లాడుతూ సుమ పై పంచ్ వేసాడు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే వచ్చే శనివారం వరకు వేచి చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel