Hyper Aadi : హఠాత్తుగా మాయం అయిన హైపర్ ఆది.. టెన్షన్‌‌లో ఫ్యాన్స్..!

Hyper Aadi : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో ప్రస్తుతం కీలక కమెడియన్స్ అంటే హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి వల్లే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షో లు రన్ అవుతున్నాయి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది కామెడీ పంచులు అంటే ప్రతి ఒక్కరు పడి పడి నవ్వాల్సిందే.

ఆయన కామెడీ చేస్తూ ఉంటే జడ్జిలు అయినా అలా చూస్తూ ఉండాల్సిందే. ఎవరితో అయినా పంచులు వేయించుకునేందుకు ఇష్టపడని రోజా ఆది పంచులు వేస్తే మాత్రం తీసుకునేందుకు ఏ మాత్రం అడ్డ చెప్పదు. ఆమె అభిమానాన్ని ఆది అంతగా దక్కించుకున్నాడు. అలాంటి అది ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కీలకంగా ఉండే ఆది మొన్నటి ఎపిసోడ్ లో కనిపించలేదు.

hyper-aadi-missing-from-sridevi-drama-company-and-dhee-dance-show
hyper-aadi-missing-from-sridevi-drama-company-and-dhee-dance-show

వచ్చే ఆదివారం ఎపిసోడ్‌లో కూడా ఆయన కనిపించడం లేదని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఆ తదుపరి వారం అయినా ఆది వస్తాడా అనేది చూడాలి. ఇటీవల ఢీ షో లో కూడా అతను కనిపించలేదు. దాంతో మల్లెమాల వారికి హైపర్ ఆది కి ఏమైనా జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు నిజమైతే హైపర్ ఆది కామెడీ ఈటీవీ లో చూడలేమని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Advertisement

ఆది ఒక సినిమా షూటింగ్ నిమిత్తం బిజీగా ఉండటం వల్ల ఆ షో ల షూటింగ్‌ లో హాజరు కాలేక పోయాడు.. అంతే తప్ప మల్లెమాల వారి నుండి ఆయన తప్పుకోడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది మరో రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Read Also : Sudheer Rashmi Love : సుధీర్.. రష్మి లవ్‌ సింబల్స్ వేయడం లేదు ఎందుకు… అసలేం జరుగుతోంది?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel