Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha comments: మంత్రి కేటీఆర్‌పై సమంత ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ ట్వీట్!

Samantha comments: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అందాల తార సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఆమెకు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి

By Vinod Kumar

Published on: June 26, 2022 7:30 PM

Updated on: June 26, 2022 7:25 PM

---Advertisement---

Samantha comments: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అందాల తార సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఆమెకు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలపై కూడా అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఓ ట్వీట్ చేసింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Heroine samantha comments on minister ktr

Advertisement

ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ-హబ్ రెండో దశలో భాగంగా రాయదుర్గంలో టీహబ్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాన్ని జూన్ 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన టీహబ్ భవనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన మంత్రి… తెలంగాణలో అన్నోవేషన్ ఎకో సిస్టమ్ కు పునరుజ్జీవం రానుందని.. ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాసాలు రానున్నాయని మంత్రి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన… భవిష్యత్తు ఊహించుకోవడం అంటే దాన్ని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గం ఇనే కొటేషన్ ప్రస్తావించారు. కేటీఆఱ్ చేసిన ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన సామ్.. హ్యాపెనింగ్ హైదరాబాద్ అనే హ్యాష్ టాగ్ తో పాటు చాలా గర్వంగా ఉందంటూ కేటీఆర్ ట్యాగ్ చేశారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.