RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదలవడమే మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటతో మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో పెరిగే ఆ చిన్నారి పాడిన ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమాలో ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని ఆరా తీస్తున్నారు.ఎంతో మధురమైన ఈ పాట పాడిన ఆ చిన్నారి ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం….

కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటను ఎంతో మధురంగా పాడిన సింగర్ పేరు ప్రకృతి రెడ్డి. ఈమె 2010 బళ్ళారిలో జన్మించారు.ప్రకృతి రెడ్డికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో మక్కువ ఉండటంతో అది గ్రహించిన ఆమె తల్లిదండ్రులు తనకు చదువుతోపాటు సంగీతంలో కూడా శిక్షణ ఇప్పించారు.ఇలా సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఎన్నో స్టేజ్ షోలలో తన అద్భుతమైన గాత్రంతో మధురమైన పాటలను ఆలపించిన ప్రకృతి రెడ్డి ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ప్రవచనాలు, సంకీర్తనలు పాడుతూ మంచి గుర్తింపు పొందారు. అలాగే ఈ టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పాటలు పాడి దివంగత ఎస్పీ బాలు మనసు దోచుకున్నారు. ఇలా సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ప్రకృతి రెడ్డి కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా పాటలు పాడుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా ఎన్నో స్టేజ్ షోలలో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబర్చిన ప్రకృతి రెడ్డి 12 సంవత్సరాల వయసులోనే రాజమౌళి సినిమాలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకోవడంతో ఈ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel