Airplane Facts : అధిక వేగం బరువు, తట్టుకునే విమానం టైర్లు ఎందుకు పేలవు.. కారణం ఏంటో తెలుసా?

Updated on: March 19, 2022

Airplane Facts : సాధారణంగా సినిమాలలో కానీ రియల్ లైఫ్ లో కానీ విమానాలు గాలి నుండి ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ విమానం టైర్లు వేగంగా నేలపై పడటం చూస్తూ ఉంటాము. అయితే ఇలా విమానం నేలపై ల్యాండ్ అయిన సమయంలో అంత పెద్ద విమానం బరువును ఆ టైర్లు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాయి? అవి పగిలిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి? అన్న సందేహాలు చాలామందికి వచ్చి ఉంటాయి. అంతే కాకుండా ఆ టైర్లు ఆ విమాన బరువుని వేగాన్ని తట్టుకుని సులువుగా ముందుకు సాగుతాయి. మరి ఆ విమానం టైర్ల ప్రత్యేకత ఏమిటి? అవి అంత బరువు ఎలా తట్టుకోగలుగుతున్నాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం..

విమానం టైర్లు ఎంత బలంగా ఉంటాయి అంటే అవి వేల పౌండ్ల బరువు, అదే విధంగా అధిక వేగాన్ని కూడా తట్టుకోగలవు. అందుకోసం వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ టైర్లను దృఢంగా తయారు చేయడం కోసం అందులో నైట్రోజన్ వాయువును కూడా నింపుతారు. నైట్రోజన్ వాయువు కారణంగా ల్యాండింగ్ సమయంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయిన దీని కలయిక ప్రభావవంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ టైర్లను సింథటిక్ రబ్బర్ సమ్మేళనాల కలయికతో తయారుచేస్తారు. అదేవిధంగా ఈ టైర్ల లో అల్యూమినియం, స్టీల్, నైలాన్ ను కూడా కలుపుతారు. ఇవి టైర్లను బలోపేతం అయ్యేందుకు బాగా ఉపయోగపడతాయి.

వీటివల్ల విమానం ల్యాండింగ్ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ పగిలిపోకుండా ఉండగలవు. అదేవిధంగా ఆ టైర్ల వల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. విమానం టైర్లు ట్రక్ టైర్ల కంటే రెండింతలు పెంచి ఉంటాయి. కార్ టైర్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ గాలి ఉంటుంది. ఈ విమాన టైర్లను తయారు చేస్తున్నప్పుడు వాటి పరిమాణం, విమానం ఆధారంగా దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు.

Advertisement

అలాగే ఈ టైర్లలో ప్రత్యేకమైన గాలిని నింపుతారు. దీనిని నైట్రోజన్ వాయువు అంటారు. విమానం టైర్లు నైట్రోజన్‌తో నింపబడి ఉంటాయి. నత్రజని జడ వాయువు కాబట్టి అధిక ఉష్ణోగ్రత, పీడన మార్పుల ప్రభావం వాటిపై తక్కువగా ఉంటుంది. టైర్లను తయారు చేసిన తర్వాత 38 టన్నుల వరకు బరువుతో పరీక్షిస్తారు. అయితే ఆ టైర్ల ను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే విమానాలకు అమర్చుతారు.

Read Also : RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రమోషన్స్ పీక్స్.. ఫస్ట్‌డే కలెక్షన్లే జక్కన్న టార్గెట్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel