Deepti Sunaina: షణ్ముఖ్ ని టార్గెట్ చేస్తూ దీప్తి సునైన పోస్ట్.. వైరల్ అవుతున్న పోస్ట్ ?

Deepti Sunaina: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లో వాడకం పెరగటం వల్ల చాలామంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి జంటగా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేయటం వల్ల బాగా పాపులర్ అయ్యారు.

ఈ క్రమంలో దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా దీప్తి సునయన మరింత పాపులర్ అయింది. తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. షణ్ముఖ్ మాత్రం ఈ బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవటంతో ప్రేక్షకులలో నెగెటివిటీ మూట కట్టుకున్నాడు. అయితే దీప్తి సునైనా మాత్రం తన ప్రియుడికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత దీప్తి సునయన అనూహ్యంగా షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది.

అప్పటినుండి వీరిద్దరూ వేరువేరుగా వారి పనులతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ తో పాటు డాన్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. తాజాగా విరాటపర్వం సినిమాలోని ‘ఎవరిని ఎవరు ప్రేమించరు. మనల్ని మనం ప్రేమించుకోవడం నిజం. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది పెద్ద అబద్ధం” అనే డైలాగ్ ఉన్న వీడియో షేర్ చేసింది. దీంతో షణ్ముఖ్ ని ఉద్దేశించే దీప్తి సునైనా ఈ వీడియో షేర్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీప్తి ఈ విధంగా ప్రేమ పై తనకి ఉన్న అభిప్రాయాన్ని తెలియచేసింది.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel