Chiranjeevi : చిరంజీవి వ‌ల్లే నా సినీ కెరీర్‌కు బ్రేక్ ప‌డింది.. సీనియ‌ర్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఎక్కవ కాలం కొనసాగడం చాలా కష్టం. మాములుగైతే ఓ ఐదేళ్లు .. మంచి గుర్తింపు వస్తే పదేళ్లు కొనసాగుతారు. ఇటీవల హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఇలా వస్తున్నారు.. అలా వెళ్లిపోతున్నారు. అయితే తమ నటనతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిన హీరోయిన్స్ చాలా తక్కువనే చెప్పాలి.. అలనాటి కథానాయకి సావిత్రితో మొదలుకుని.. సౌందర్య… ఇటీవల అనుష్క ఇలా చాలా తక్కువ పేర్లే వినిపిస్తాయి.

ఇక్కడ ఓ హీరోయిన్ పేరు గురించి చెప్పుకోవాలి. ఆమె పేరే మోహిని. ఈ పేరు వింటే ఆమెను గుర్తుపట్టకపోవచ్చు. ఆదిత్య 369 మూవీలో బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సిమాలో నటించింది ఈ మోహినినే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మోహిని హిరోయిన్‌గా అలరించింది. మోహిని తెలుగు సినిమాలతో పాటు తమిళం, మళయాలంలో 100కుపైగా చిత్రాల్లో నటించింది. తెలుగు హిట్లర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లులుగా కూడా నటించింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో మలుపులెన్నో ఉన్నాయని చెప్పిన ఈ ముద్దుగుమ్మ..తన లైఫ్ ఇలా అయిపోవడానికి పరోక్ష కారణం చిరంజీవి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మోహిని. తన అందంతో నటనతో తమిళ, మళయాల బాషల్లో మెప్పించిన ఈ భామ తెలుగు అభిమానులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

Advertisement

దీనికి కారణం చిరంజీవి సినిమా‌నే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చిరంజీవి హిట్లర్ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించిన మోహినికి ఆ తరువాత హీరోయిన్‌గా అవకాశాలు రాలేదట. ఈ విషయంపై డైరెక్టర్స్‌ను అడిగితే.. ఇప్పటికే చెల్లిగా నటించావు..

మళ్ళీ హీరోయిన్ అంటే ప్రేక్షకులు చూడరని మొహం మీద చెప్పేశారని చెప్పుకొచ్చింది మోహిని. దీంతో చిరంజీవికి చెల్లిగా నటించడం తాను చేసిన పొరపాటని.. దీంతో తన కెరీర్‌ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగకపోవటానికి హిట్లర్ సినిమానే కారణమని మోహిని కుండబద్దలు కొట్టింది.

Also Read : Shanmukh Deepthi : షణ్ముక్, దీప్తి సునయన బ్రేకప్.. బిగ్‌బాస్ ఎంత పని చేసింది..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel