Bigg Boss 5 Telugu : బిగ్‌బాగ్ హౌస్‌లో సన్నీ ఎర్రి పుష్ఫమట.. మళ్లీ దెబ్బకొట్టిన రవి..!

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌస్ లో కంటస్టెంట్ సన్నీ.. ఏ టాస్క్ చేసిన కెప్టెన్‌తో గొడవకు దిగుతూనే ఉంటున్నాడు. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. అయితే హౌస్‌లో సన్నీ పేరు చెబితే రవికి పడటం లేదు. టీషర్ట్ సరిగ్గా వేసుకోవాలనే రూల్‌ను టాస్క్ మధ్యలో తీసుకొచ్చి సన్నీ వేసుకున్న షర్టులను డిస్‌క్వాలిఫై చేశాడు రవి. దీంతో టాస్క్‌లో మానస్ చేసితో సన్నీ ఓటమిపాలయ్యాడు. రూల్స్ ముందే చెప్పాలంటూ రవిపై ఫైర్ అయ్యాడు సన్నీ. మరో పక్క తన స్ట్రాటజీని ప్లే చేస్తూ ముందుకు సాగుతున్నాడు రవి. ఈ రోజు (75వ ఎపిసోడ్) ప్రోమో రిలీజ్ చేయంగా తన తెలివిని ప్రదర్శిస్తూ రవి కనిపించాడు.

ఇక కంటస్టెంట్స్ దృష్టిని తన వైపు మళ్లించుకునేందుకు రవి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. యానీ మాస్టర్‌, శ్రీరాంతో కూర్చుని సన్నీ, మానస్‌లను టాస్క్‌ల్లో ఓడించేందుకు స్కెచ్‌లు వేస్తూ కనిపించాడు. అయితే ముందుగానే రవితో డీల్ కుదరడంతో యానీ మాస్టర్, శ్రీరామ్ ఉండగానే… రవి సూపర్ పవర్‌ను దక్కించుకున్నాడు. కానీ దానిని సన్నీకి సాక్రిఫైజ్ చేశాడు రవి. దానికి సన్నీ ఒప్పుకోలేదు. బిగ్ బాస్ ఆర్డర్ అనడంతో సన్నీ అందుకు ఒప్పుకున్నాడు.

అనంతరం దానిని వేరే కంటస్టెంట్‌కు ఇచ్చేస్తానని సన్నీ చెప్పినా.. అందుకు వీల్లేదంటూ రవి బదులిచ్చాడు. దీంతో సన్నీకి ఏం తోచలేదు. బిగ్‌బాస్ సార్… అతనికి తాను ఎందుకు నచ్చాను.. సీరియస్ గా ఉన్న కెప్టన్‌ సైతం ఇంతలా బిల్డప్ ఇవ్వడు అనుకుంటా. ఈ పవర్ టూల్ తో తనను రెచ్చగొట్టేలా చేసి పంపించేస్తారు. అక్కడికి వెళ్లాక ఇక ఎప్పటిలాగనే తనను ఎర్రి పుష్పాన్ని చేసేస్తారు అంటూ సన్నీ ఫీల్ అయ్యాడు పాపం..

Advertisement

Read Also : Monal Gajjar : యానీ మాస్టర్‌ బిగ్‌బాస్ లోకి వచ్చింది అందుకేనట.. మోనాల్ షాకింగ్ కామెంట్స్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel