Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Kili Paul: టాంజానియా కిలి పాల్ పై హత్యాయత్నం.. ఆస్పత్రి పాలైన ఇంటర్నెట్ సెన్సేషన్!

Kili Paul: టాంజానియా కీలి పాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇతను ఎంతో సుపరిచితమే. తన అద్భుతమైన డాన్స్

By Ramesh Babu

Published on: May 2, 2022 10:30 PM

Updated on: May 2, 2022 7:46 PM

---Advertisement---

Kili Paul: టాంజానియా కీలి పాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇతను ఎంతో సుపరిచితమే. తన అద్భుతమైన డాన్స్ వీడియోలతో అందరిని సందడి చేసిన కిలీ పాల్ పై దుండగులు హత్యాయత్నం చేశారు ఈ క్రమంలోని ఇతనిపై కర్రలతో దాడి చేయగా ఈయన ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యారు. కిలి పాల్ బాలీవుడ్ తో పాటు ఇతర భాష చిత్రాలలోని పాటలకు అద్భుతమైన రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కిలి ఫాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

pjimage 16టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్‌, నీమాపాల్‌లు. వీరు తెలుగులో కూడా పుష్ప పాటలకు అద్భుతమైన డాన్స్ లు చేశారు. ఇలా డాన్స్ రీల్స్ ద్వారా
ఎంతో ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న వీరిపై ఎవరో కర్రలతో విపరీతంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అవుతూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ సందర్భంగా కిలి పాల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Advertisement

కొందరు తనని కింద పడేయాలని చూస్తున్నారు. అయితే ఆ దేవుడు మాత్రం తనకు సహాయం చేస్తూ ఉన్నాడు నాకోసం ప్రార్థించండి అంటూ ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన చేతి వేళ్ళకు, ఒంటి పై తీవ్రమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ప్రేక్షకులను సందడి చేసే ఇతనిపై ఎవరు హత్యాయత్నం చేసి ఉంటారు? తనపై హత్యాయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :