Anupama : అనుపమ పరమేశ్వరన్ మామూలుగా అయితే ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. ఆమె సీరియస్ అయిన లక్షణాలు ఎక్కడా కూడా కనిపించవు. మీడియా ముందైనా సరే, వెనకాలైనా సరే ఆమె ఎక్కువగా నవ్వుతూనే కనిపి్తుంది. ఇక నెట్టింట్లో అయితే నెటిజెన్లు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా పాజిటివ్ గానే తీసుకుంటుంది. అయినా అుపమకు అన్నీ పాజిటివ్ కామెంట్లే కనిపిస్తుంటాయి. అయితే అనుపమకు మాత్రం తాజాగా కోపం బాగానే వచ్చినట్లు కనిపిస్తోంది. కాస్త ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ వేసింది.

అయితే ఆమె షేర్ చేసిన దృశ్యాలు అత్యంత చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే రోడ్లనిండా చెత్తే కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్తను విసిరారు. అలా రోడ్లన్నీకూడా చెత్తతో నిండిపోయాయి. ఇక వాటిని ఆవులు తింటూ ఉన్నాయి. అయితే వీటిపై అనుపమ పరమేశ్వరన్ అందరినీ బాధ్యుల్ని చేసి తిట్టేసింది. నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలానే మొదలవుతుంది.. ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చేస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్న వారిని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది.. సేవ్ ఎర్స్, సేవ్ ప్లానెట్ అనే హ్యాష్ ట్యాగల్ తో అనుపమ ఓ పోస్ట్ వేసింది. ఇక దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
AdvertisementView this post on Instagram