Aadharam Movie : ‘ఆధారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..

Updated on: August 4, 2025

aadharam movie first look poster launch : లవ్ & క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆధారం’ కొత్త పోస్టర్ విడుదల అయింది. సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నిరోషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో సినీప్రముఖుల సమక్షంలో ఆధారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వెల్లూరిపల్లి ప్రజెంట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

aadharam poster release movie 2021
aadharam poster release movie 2021

ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. లవ్ ఎమోషన్,థ్రిల్లర్ “ఆధారం” మూవీ కొత్త నటీ నటులతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా పాటలు బాగా ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త టాలెంటు చాలా ఉందని, ఆ టాలెంట్‌ని బయటికి తీసుకురావాలనే ఆలోచనతో  కొత్తవారిని తీసుకొచ్చి కొత్త సినిమాలు చేస్తున్నానని దర్శక నిర్మాత గోపి పోలవరపు చెప్పారు. ఈ మూవీకి  డైలాగ్స్, డైరెక్షన్ తానే రాసుకొని సినిమాను డిసెంబర్‌లో  షూటింగ్ ప్రారంభించి ఫస్ట్ షెడ్యూల్ చేశాను. డిసెంబర్‌లో సెకండ్ షెడ్యూల్ చేద్దామనుకున్న సమయంలో కరోనా మొదలైంది కరోనా టైంలో మా ఆర్టిస్టులంతా సపోర్ట్ నిలిచి మూవీ కంప్లీట్ అయ్యేందుకు సాయపడ్డారని తెలిపారు.

Advertisement

మా ఆధారం మూవీ నిలబడేందుకు ముఖ్య కారణం హీరో భరత్ చంద్ర అని, ఆయన చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పారు. హీరోయిన్ కూడా చాలా చక్కగా నటించిందని చెప్పారు. నజీర్ మంచి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ మొత్తం క్రైమ్ థ్రిల్లర్  స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. సిచువేషన్ తగినట్గుగా సాంగ్స్ అందించారు. రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు పాటలు చాలా బాగా వచ్చాయి.

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ అద్భుత విజయం సాధించాలని తెలిపారు. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మూవీలో లీడ్ రోల్ ఇచ్చినందుకు గోపికి హీరో సూర్య ధన్యవాదాలు తెలిపాడు. నా మొదటి సినిమా.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు హీరోయిన్ రేణు శ్రీ ధన్యవాదాలు తెలిపింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ద్వారా గొప్ప విజయం సాదించాలని కోరుకుంటున్నాను.

నటీనటులు వీరే :
సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, యోగి కత్రి, వీరభద్రం, వెంకటేశ్వర రావు, వైజాగ్ సత్యనారాయణ, నితీష్, చరణ్, వాసు

Advertisement

సాంకేతిక నిపుణులు :
పజెంట్స్ : సితార వల్లూరిపల్లి
బ్యానర్ : శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్
డైలాగ్స్, ప్రొడ్యూసర్, స్టోరీ,స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : గోపి పోలవరపు
డిఒపీ : వెంకట్
మ్యూజిక్ : యస్.యన్.నజీర్
ఎడిటర్ : మేనగ శ్రీను
లిరిక్స్ : అంబట్ల రవి
ఫైట్స్ : యాక్షన్ రవి
కొరియోగ్రాఫర్ : రజని
పి.ఆర్.ఓ : గోపి పెరబోయిన
Read Also : Kanuga Health Benefits : కానుగ చెట్టుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మీ ఊళ్లో కనిపిస్తే అసలు వదలొద్దు.. ఎందుకంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel