Kanuga Health Benefits : కానుగ చెట్టు ఉండని ఊరండదు అంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రతీ ఊర్లో చాలా విరివిగా కనిపించే మొక్క ఇది. గత 15 ఏళ్ల నుంచి వీటి సంఖ్య పెరిగింది. అంతకు ముందు ఈ మొక్కలు లేవా ? అంటే ఉన్నాయి. కానీ చాలా తక్కువ సంఖ్యలో. ఎప్పుడైతే ప్రభుత్వం మొక్కల పెంపకం పట్ల ఆసక్తి కనబర్చిందో అప్పటి నుంచి వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ప్రభుత్వాల పర్యావరణ సమత్యుల్యాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకం కార్యక్రమం చేపడుతాయి. అందులో భాగంగా అన్ని రకాల మొక్కలు నాటారు. అయితే కానుగ చెట్టులో ఉన్న విశిష్టతను దృష్టిలో పెట్టుకొని వీటిని అధికంగా నాటారు. ఈ మొక్క సులభంగా నాటుకోవడమే కాక.. చాలా ఒత్తుగా పెరిగి చక్కటి నీడను, చల్లని గాలిని ఇస్తుంది. ఎండ కాలంలో సైతం పచ్చగా కనిపించి, కనువిందు చేస్తుంటుంది.
అందుకే ఈ మొక్కలు ఇప్పుడు ప్రతీ గ్రామంలో కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్కల్లో చాలా ఔషద గుణాలున్నాయి. కానీ ఇవి చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుంది. చర్మ సమస్యలను ఈ మొక్క యొక్క ఆకులు, బెరడు దూరం చేస్తాయి. అంటే చర్మానికి అయ్యే గాయాలు, దద్దుర్ల నివారణకు ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది. కానుగ గింజలను దంచి, పేస్ట్‌లా చేయాలి. దీనిని తేనెతో లేదా నెయ్యితో కలుపుకుని తినాలి.
ఇలా చేస్తే శరీరంలో జరిగే రక్త స్రావాన్ని అరికట్టొచ్చు. అలాగే కానుగ గింజల పేస్ట్‌ను ఉప్పుతో, పెరుగుతో తింటే శరీరానికి వెలుపల జరిగే రక్త స్రావాలను నివారించవచ్చు. ఆకులను దంచి దానికి నువ్వెల నూనె కలపాలి. దానిని ఆవు నెయ్యితో కలిపి వేయించాలి. దానిని వేయించిన గోదుమ పిండితో కలిపి తినాలి.ఇలా చేస్తే సులభంగా మోషన్స్ అవుతాయి.
Read Also : Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద చిట్కా..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world