Vasthu tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా నియమ, నిబంధనలు ఉన్నాయి. మనం ఏ పని చేసినా.. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయించాలి వాటి అంశాలన్నింటిని గురించి వివరిస్తారు. అయితే ఈ క్రమంలోనే పలు రకాల వస్తువులను వాడొద్దంటూ పెద్దలు తరచుగా చెప్తుంటారు. ఇక వాస్తు శాస్త్రంలో కూడా ఇలాంటివే కొన్ని కనిపిస్తుంటాయి. ఇతరులకు సంబంధించిన కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుందని చెబుతోంది. ఈ చిన్న విషయాలు మీకు భారీ నష్టాన్ని కల్గించే అవకాశం ఉంది. ఇతరులకు సంబంధించిన ఏలాంటి వస్తువులు వాడకూడదో.. వాడితే కల్గే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రుమాలు.. వేరొకరి రుమాలు వాడటం అస్సలే మంచిది కాదు. అలాగే చేతి రుమాలును గిఫ్టుగా తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే గడియారం.. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని సానుకూల, ప్రతికూల శక్తితో అనుసంధానించి చూస్తుంటారు. మణికట్టుపై మరొకరి గడియారాన్ని ధరించడం చాలా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషికి చెడుకాలం మొదలవుతుందని అంటారు. ఉంగరం… వాస్తు శాస్త్రంలో మరొకరి ఉంగరాన్ని ధరించడం కూడా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం, జీవితం, ఆర్థిక రంగంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే పెన్ను, దుస్తులు కూడా ఒకరివి మరొకరు వాడకూడదు. దీని వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి జీవితంలో అనేక రకాల కష్టాలు రావడం మొదలవుతుంది.
Read Also : Shani Amavasya : ఏప్రిల్ 30న శని అమావాస్య… కాకి ఈ గింజలు వేస్తే చాలు అదృష్టం మీ వెంటే!