Shani Amavasya :మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఈ నెల 30వ తేదీ అమావాస్య రానుంది ఈ అమావాస్యను శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ శని అమావాస్య రోజున పితృదేవతలకు ప్రతీకగా ఉన్నటువంటి కాకులకు, కుక్కలకు దానం చేయడం వల్ల మన పై ఉన్న శని ప్రభావం తొలిగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగా శని వాహనం కాకి అందుకే కాకిని కూడా శని సూచకంగా పరిగణిస్తారు. అయితే కాకి కొన్ని సందర్భాలలో చెడు సంకేతాలను సూచించినప్పటికీ మరికొన్ని సందర్భాలలో శుభ సంకేతాలను సూచిస్తుంది.
మనం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కాకి పదే పదే అరిస్తే మనం వెళ్లే పనిలో విజయం కలుగుతుందని భావిస్తారు. అదేవిధంగా కాకి మన ఇంటి ఉత్తరదిక్కున గట్టిగా అరుస్తూ ఉంటే మనకు ధనయోగం ఉంటుందని అర్థం.అలాగే కాకుల గుంపుగా ఇంటిపై తరచూ పదేపదే అరుస్తూ ఉంటే ఆ ఇంటిలో ఏదో సమస్య రాబోతుందని సంకేతం. ఇక నిండుకుండ అన్నం పై వాలితే ఆ ఇంటిలో ధన ప్రవాహం ఉంటుందని అర్థం. ఇలా కాకి ఒక్కో సంకేతానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
ఈ క్రమంలోనే పితృదేవతలకు ప్రతీకగా భావించే ఈ కాకులకు శని అమావాస్య రోజున కొన్ని బియ్యపు గింజలు వేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్లి అదృష్ట దేవత మన తలుపు తడుతుంది.శని అమావాస్య రోజున కాకి ఏ సమయంలో కనిపించినా గుప్పెడు బియ్యం కాకులకు వేయటం వల్ల వారికి రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత శనైశ్చరాయ నమః అనే మంత్రం చదవడంతో శనిదోషం కూడా తొలగిపోతుంది. ఇక శని అమావాస్య రోజు శనీశ్వరుడిని పూజించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుంది.ఇక శని అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం సింధూరంతో ఆంజనేయస్వామిని పూజించడం అలాగే మన స్థాయి కొలది దానధర్మాలు చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
Read Also :Lord Shani: శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ చేయాలి…!
Tufan9 Telugu News And Updates Breaking News All over World