Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. సరస్వతి దేవి జన్మదినం. సరస్వతి దేవి ఆవిర్భావ దినం.
దేవతలందరూ సరస్వతి దేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిస్తున్న రోజు వసంత పంచమి. అందుకే వసంత పంచమని సరస్వతీదేవి జన్మదినంగా సరస్వతి దేవి ఆవిర్భావదనంగా మనందరం జరుపుకుంటాం. వసంత పంచమి రోజు మీ పిల్లలకు సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. మీ పిల్లలందరూ బ్రహ్మాండంగా విద్యారంగంలో రాణిస్తారు.
వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది. ఎగ్జామ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబులు కొట్టాలి అనుకునే వాళ్ళు వసంత పంచమి రోజు సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
Vasant Panchami 2025 : వసంత పంచమి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి :
అలాగే ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు గాని లేదా అయ్యే ఐఏఎస్, ఐపీఎస్ ఇలా గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గాని అందులో ర్యాంకులు రావాలంటే కావలసిన చోట సీట్లు రావాలంటే వసంతం రోజు సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజించాలి.
అలాగే మీ పిల్లలు చదువులో ముందు ఉండాలన్నా కూడా సరస్వతి దేవిని పూజించాలి. సరస్వతి దేవిని ఎలా పూజించాలి అంటే.. వసంత పంచమి రోజు మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద ఒక తెల్లటి వస్త్రాన్ని దానిమీద సరస్వతి ఫొటో ఉంచుకోవాలి.
ఆ ఫొటోకు గంధ బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి సరస్వతి దేవి ఫోటో దగ్గర తొమ్మిది వత్తుల దీపం వెలిగించాలి. అమ్మవారికి ఈ వత్తుల దీపం అంటే చాలా ఇష్టం. అందుకుని వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. సర్వ శుక్ల సరస్వతి సరస్వతి దేవి తెలుపు రంగులో ఉంటుంది
కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతి దేవిని పూజించాలి. మల్లెపూలు, జాజిపూలు నందివర్ధనం పూజలు ఇలా తెల్ల పుష్పాలతో సరస్వతీ దేవిని పూజిస్తూ ఓం ఐం సరస్వత్త్యై నమ: అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే, సరస్వతీ దేవీకి పాలు గాని పెరుగు గాని వెన్న గాని పటిక బెల్లం గాని తెల్లబెల్లం గాని కొబ్బరి గాని పేలాలు గాని నైవేద్యంగా సమర్పించాలి. ఇందులో ఏదైనా నైవేద్యంగా పెట్టినా సరస్వతి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వసంత పంచమి రోజున ఇలా సరస్వతి దేవిని పూజించాలి.
















