Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు అంతా శుభమే..!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 6వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి.. మిథున రాశి వాళ్లకు శ్రేష్ఠమైన కాలం. అభీష్ట సిద్ధీ, అనేక శుభ యోగాలూ ఉన్నాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దానధర్మాలు చేసే అవకాశం లభిస్తుంది. గృహ, భూ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏం కొనుక్కోవాలనుకున్న వారైనా ఈ వారంలో కొనుగోలు చేయడం మంచిది. ఇష్ట దేవతను స్మరించండి. శుభవార్త వింటారు.

Advertisement

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా వెనకడుగు వేయుకుండా ముందుకు సాగండి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel