Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకి ఈ వారం అంతా పట్టిందల్లా బంగారమే..!

Updated on: May 30, 2022

Horoscope : ఈ వారం అంటే మే 29 నుచి జూన్ 4వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రాహాల వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. వారికి ఈ వారం అంతా చాలా బాగుంది. అయితే ఆ రాశులు ఏంటి, వారికి ఏయే విషయాల్లో మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope
Horoscope

ముందుగా కర్కాటకం.. ఈ రాశి వాళ్లకు శుభ యోగం ఉంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే అంత ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. ప్రతి అడుగూ అభివృద్ధి వైపే వేయాలి. ఉద్యోగ వ్యాపారాలు లాభిస్తాయి. గౌరవప్రదమైన జీవితాన్ని అందుకుంటారు. నిస్వార్థంగా చేసే కార్యాలు తృప్తినిస్తాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఇష్ట దైవాన్ని ధ్యానించండి, ఆనందంగా ఉంటారు.

అలాగే సింహ రాశి.. ఈ రాశి వాళ్లకు కోరికలు నెరవేరతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. కీర్తిశిఖరాలను అధిరోహిస్తారు. ధనలాభం ఉంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. పదిమందికీ ఆదర్శప్రాయులవుతారు. వస్తులాభం సూచితం. ఈర్ష్యాపరుల మాటలు పట్టించుకోవద్దు. భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు.

Advertisement

Read Also : Goddess Laxmidevi: ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel