Temple Pradakshinas : గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? అలా చేయకపోతే ఏమౌతుంది?

Temple Pradakshinas : గుడికి వెళ్లి వారు తప్పని సరిగా ప్రదక్షిణలు చేస్తారు. ఆలయంలో ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఏవైనా గ్రహాచారాలు బాగలేకున్నా.. అరిష్టాలు ఏర్పడినా.. గుడిలో ప్రదక్షిణలు చేస్తే వాటి నుంచి పరిహారం లభిస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదక్షిణలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది.

ప్ర అంటే పాప నాశనం, ద అంటే కోరుకలను నెరవేర్చేది, క్ష అంటే వచ్చే జన్మల నుంచి విముక్తి, ణ అంటే జ్ఞానంతో ముక్తికి ప్రసాదించేది. దేవుడు మన జీవితాలకు కేంద్రం, ఆధారం, సారం. మనం ఆయన్ను కేంద్రంగా చేసుకుని మన జీవిత పనులను కొనసాగిస్తాం. ఈ ప్రాముఖ్యతను గురించి తెలిపేదే ప్రదక్షిణం. వృత్త పరిధి కేంద్ర బిందువు నుంచి సమానమైన దూరంగాలోనే ఉంటుంది. అలాగే మనం ఎక్కడ ఉన్న దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడని అర్థం.

what is importance of temple pradakshinas in telugu
what is importance of temple pradakshinas in telugu

ప్రదక్షిణలు చేసే సమయంలో దేవుడు మనకు కుడివైపున ఉంటాడు. అందుకే ప్రదక్షిణం ఎడమ నుంచి కుడి వైపుకు చేస్తాం. మన దేశంలో కుడి వైపు అనేది శుభప్రదమును తెలుపుతుంది. దీని వల్ల గర్భాలయాన్ని కుడి‌వైపుగా ఉంచి ప్రదక్షిణలు చేస్తాం. భారతీయ వేద గ్రంథాలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెబుతుంటాయి. ఈ భావంతో మనం మన తల్లి దండ్రులకు, మహాత్ములకు ప్రదక్షిణ చేస్తాం.

Advertisement

అయితే గుడిలో చాలా సార్లు.. మూడు లేదా అయిదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తుంటాము. అయితే కొన్ని దేవుళ్లకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మన పూర్వికులు నిశ్చయించారు. విఘ్నేశ్వరునికి ఒక ప్రదక్షిణ, సూర్యుడికి రెండు ప్రదక్షిణలు, మహాశివుడికి మూడు ప్రదక్షిణలు, విష్ణుమూర్తికి నాలుగు ప్రదక్షిణలు, రావిచెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయడం పద్ధతి. పూజ చేసిన తర్వాత మనం ఆత్ ప్రదక్షిణ చేస్తాం. దీని వల్ల బయట విగ్రహరూపంలో ఉన్న దేవుడు మనలోని విశిష్ట దివ్యత్వం అని గుర్తిస్తాం.

Read Also : Vasthu tips: వాస్తు ప్రకారమే పూజ గది కూడా ఏర్పాటు చేసుకోవాలట.. లేదంటే ఇక అంతే!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel