Shani Dev Effect: ఏలినాటి శని దోషం అంటే ఏమిటి..ఈ దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి?

Shani Dev Effect: శని దేవుడి పేరు చెప్పగానే చాలా మంది భయపడతారు ఒకసారి శని మన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే కొన్ని సంవత్సరాలపాటు మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా కొందరు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతుంటారు అసలు ఏలినాటి శని దోషం అంటే ఏమిటి ఈ దోషం తొలగి పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం ఏలినాటి శని ప్రతి వ్యక్తి జీవితంలోనూ రెండు మూడు సార్లు వస్తుంది.

మనిషి పుట్టినప్పుడు జాతకుడు ఏలినాటి శని ప్రభావంతో పుడితే అతని జీవితంలో శని ప్రభావం మూడుసార్లు ఉంటుంది. అయితే ఈ విధంగా వచ్చినటువంటి ఏలినాటి శని ప్రభావం తొలిగిపోవడం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయానికి వస్తే…ఏలినాటి శని ప్రభావం తొలిగిపోవడం కోసం శనివారం శనీశ్వరుని చాలీసా చదవడం ఎంతో మంచిది. ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఇలాంటి పరిహారాలు చేయటానికి ఎంతో అనువైన రోజు.

Advertisement

శని ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదియ హృదయంతో పాటు సుందరాకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీసా చదవాలి. ముఖ్యంగా ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారి ముందు నైవేద్యంగా నల్లనువ్వులను సమర్పించి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, పక్షులకు ఆహారం పెట్టడం ద్వారా శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అదేవిధంగా స్వామివారి ఆలయంలో పూజ చేసిన అనంతరం పేదలకు దానధర్మాలు చేయాలి. పేదలకు వస్తు రూపంలో లేదా ధనరూపంలో ధర్మం చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది.పూజ తర్వాత వస్త్రదానం చేస్తే ఆ వస్త్రాన్ని దానం తీసుకున్న వారు ఉపయోగించేలా ఉండాలని అప్పుడే శని ప్రభావానికి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel