Raksha Bandhan 2025 : రక్షా బంధన్ అనేది సోదరుడు, సోదరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేసే పవిత్రమైన పండుగ. సోదరి తన సోదరుడి చేతి మణికట్టుపై (Raksha Bandhan 2025) రాఖీ కడుతుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షించి, ఆదుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. రక్షా బంధన్‌ను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
ఈసారి రక్షా బంధన్‌ను ఆగస్టు 9, 2025న జరుపుకుంటారు. రక్షా బంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుడి చేతికి రాఖీ కట్టినప్పుడు, వారి సోదరులు వారికి కొన్ని పండుగ బహుమతులు ఇస్తారు.
కానీ, తమ సోదరీమణులకు పండుగ బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే, అది చెడు శకునంగా మారుతుంది. రక్షా బంధన్ రోజున సోదరుడు తన సోదరికి ఏయే బహుమతులు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Raksha Bandhan 2025 : 1. అల్యూమినియం వస్తువులను ఇవ్వొద్దు :
సోదరులు రక్షా బంధన్ రోజున తమ సోదరీమణులకు అల్యూమినియం సంబంధిత వస్తువులను ఇవ్వకూడదు. ఎందుకంటే.. అల్యూమినియం రాహువుకు సంబంధించినది. రాహువు చెడు ప్రభావం మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
2. తోలుతో తయారైన వస్తువులు ఇవ్వొద్దు :
రక్షా బంధన్ రోజున మీ సోదరికి తోలు వస్తువులను ఇవ్వొద్దు. రక్షాబంధన్ పండగ రోజున మీరు మీ సోదరికి తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వొద్దు. తోలు సంచి లాంటివి. ఎందుకంటే, తోలు ప్రతికూల శక్తిగా చెబుతారు. తోలు పవిత్రంగా పరిగణించబడదు. అందుకే సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది.
Read Also : Kaal Sarp Dosh Puja : కాల సర్ప దోషం ఏంటి? మీ జాతకంలో దోషం ఉంటే కనిపించే లక్షణాలేంటి? నివారణకు ఏం చేయాలి?
Raksha Bandhan 2025 : 3. కత్తి వంటి వస్తువులను ఇవ్వకూడదు :
రక్షాబంధన్ నాడు మీ సోదరికి చాకు లేదా కత్తి వంటి వస్తువులను ఇవ్వొద్దు. రక్షాబంధన్ పండగ సందర్భంగా సోదరులు పొరపాటున కూడా తమ సోదరీమణులకు కత్తి సెట్ వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే.. మీరు వారికి బహుమతిగా ఇస్తే.. మీ సంబంధంలో ప్రతికూలత, గొడవలు ఉండవచ్చు. మీ సోదరి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
4. ఇనుప వస్తువులను ఇవ్వొద్దు :
రక్షాబంధన్ నాడు శనికి సంబంధించిన వస్తువులను ఇవ్వకండి. రక్షాబంధన్ సందర్భంగా మీ సోదరికి ఇనుముకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వొద్దు. ఎందుకంటే.. ఈసారి రక్షాబంధన్ పండుగ శనివారం వస్తుంది. ఈ పరిస్థితిలో శనివారం ఇనుప వస్తువులను ఇవ్వడం వల్ల శనిగ్రహం దోషం కలుగుతుంది. ఈసారి మీ సోదరీమణులకు శనికి సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వకండి.
5. చేతి రూమాలు ఇవ్వొద్దు :
హ్యాండ్ ఖర్చీఫ్ గిఫ్ట్ ఇవ్వొద్దు. రక్షా బంధన్ నాడు పొరపాటున కూడా మీ సోదరికి చేతిరుమాలు లేదా ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వకండి.