Wallet Vastu: మీ వాలెట్ చినిగిపోయిందని పడేస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Wallet Vastu: సాధారణంగా కొన్ని వస్తువులు వాస్తు పరంగా మనకు ఎంతో మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి.అందుకే ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటాము.అయితే అలాంటి అదృష్టం కలిగించే వస్తువులు పాడైపోతే వాటిని బయట పడేయాలంటే చాలామందికి మనసు ఒప్పుకోదు.ముఖ్యంగా కొందరికి వారి పర్సులో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఎంతో అదృష్టం కలిసివస్తుందని ఆ పర్స్ లో డబ్బులు పెట్టడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తుంటారు. అయితే ఆ ఫర్స్ పాడైపోతే ఆ ఫర్స్ పడేసేముందు ఎంతో బాధపడుతూ ఉంటారు.

ఈ విధంగా మనకు అదృష్టం కలిగించిన పర్స్ పడేసే ముందు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల పాత పర్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కొత్త పరిధిలోకి వస్తుంది.పాత పర్సులో ఉన్నటువంటి అదృష్టం కొత్త పర్సులోకి రావాలంటే పాత పర్సులో ఒక రూపాయి బిళ్ళను ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.అదేవిధంగా పాత పర్సులో కొన్ని బియ్యపు గింజలను వేసి మరుసటి రోజు ఆ బియ్యపు గింజలను కొత్త పర్సులో వేసుకోవటం వల్ల పాత పర్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కొత్త పర్సులోకి వస్తుంది. తద్వారా యధావిధిగా మన దగ్గర డబ్బులు నిల్వ ఉంటాయి.

ఇకపోతే చాలామంది ఇలా పాత పర్స్ పడేయడానికి మనసు ఒప్పుకోకపోతే వాటిని వారి దగ్గరే ఉంచుకోవచ్చు. అయితే ఖాళీగా ఉండకుండా కొన్ని బియ్యపు గింజలు,లేదా రూపాయి నాణెం వేసి వాటిని భద్రపరచుకోవాలి. అప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.లేదంటే చిరిగిపోయిన వాలెట్ అలాగే పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel