Black Thread : కాలికి నల్లని దారాన్ని ఎందుకు కట్టుకుంటారో తెలుసా..!

Black Thread : నేటి కాలంలో చాలా మంది కాళ్ల‌కు న‌ల్ల‌దారం క‌ట్టుకుంటున్న విష‌యం అందరికీ తెలిసిందే. కాలి మ‌డ‌మ‌ల ద‌గ్గ‌ర న‌ల్ల‌ని దారాన్ని క‌ట్టుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీంతో వారిని చూసి ఫ్యాన్స్ కూడా ఇలా క‌ట్టుకుంటున్నారు. ఇలా కాళ్ల‌కు న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం అనేది ఎక్కువైంది. అయితే దీన్ని చాలా మంది ఫ్యాష‌న్ కోసం క‌ట్టుకుంటున్నారు. కానీ దీంతో వాస్త‌వానికి ఆధ్యాత్మిక ప‌రంగా కూడా ప‌లు లాభాలు క‌లుగుతాయి. అవేమిటో మీకోసం…

పురాత‌న కాలం నుంచి కాళ్ల‌కు న‌ల్ల‌నిదారం క‌ట్టుకోవ‌డం అనేది ఉన్న‌దే. కాళ్ల‌కు న‌ల్ల‌ని దారం క‌ట్టుకోవ‌డం వల్ల దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రుగుతాయి. ఇత‌రుల చూపు మ‌న‌పై ఉండ‌దు. ఎవ‌రైనా మ‌న ఎదుగుల‌ను చూసి ఓర్వ‌లేక అసూయ చెందితే అప్పుడు న‌ల్ల‌నిదారం ర‌క్ష‌ణ‌గా ప‌నిచేస్తుంది. దీంతో వారి దిష్టి మ‌న‌కు త‌గ‌ల‌కుండా ఉంటుంది. ఇదీ.. న‌ల్ల‌ని దారం క‌ట్టుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు విష‌యం.

PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు
devotional-news-about-tieng-black-thread-for-leg-in-telugu
devotional-news-about-tieng-black-thread-for-leg-in-telugu

అలానే న‌ల్ల‌ని దారాన్ని కేవ‌లం కాళ్ల‌కే కాదు, న‌డుముకు మొల‌తాడు రూపంలోనూ ధ‌రిస్తారు. దీని వ‌ల్ల కూడా దిష్టి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే న‌ల్ల‌నిదారం చ‌ల్ల ద‌నాన్ని గ్ర‌హిస్తుంది. దీంతో జ‌న‌నావ‌య‌వాలు చ‌ల్ల‌గా ఉంటాయి. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. న‌డుముకు మొల‌తాడు రూపంలో న‌ల్ల‌ని దారం క‌ట్టుకోవ‌డం వ‌ల్ల న‌డుం చుట్టు కొలత ఎల్ల‌ప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. దీంతో అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. ఇక న‌ల్ల‌నిదారాన్ని చేతుల‌కు, భుజాల‌కు కూడా క‌ట్టుకోవ‌చ్చు. న‌ల్ల‌నిదారాన్ని ఫ్యాష‌న్ కోసం కాకుండా దిష్టి త‌గ‌ల‌కుండా ఉండేందుకు ధ‌రించ‌వ‌చ్చు. దీంతో నెగెటివ్ ఎన‌ర్జీ నుంచి, దుష్ట శ‌క్తుల ప్ర‌భావం నుంచి కూడా త‌ప్పించుకోవ‌చ్చు. క‌నుక ప్ర‌తి ఒక్కరూ న‌ల్ల‌నిదారం ధ‌రించాలి.

Advertisement

Read Also : Shani dev : శనిదేవుడి ఆరాధనలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అప్పుడే లాభాలు!

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel