Ashtalaxmi sthothram : అష్ట కష్టాలను దూరం చేసే అష్టలక్ష్మీ స్తోత్రం.. మీరూ ఓసారి చదవండి!

Updated on: June 2, 2022

Ashtalaxmi sthothram : చాలా మంది జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటారు. వాటితో వేగలేక పోతారు. ఇంకొంత మంది తమ జీవితం మొత్తం కష్టాలపాలు అయిందని మదన పడిపోతూ ఉంటారు. ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. అందులో మొట్ట మొదటిది ఆరోగ్యం. దాని తర్వాతది డబ్బు. ఈ రెండు ఉండే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు అని చాలా మంది భావిస్తారు.

కానీ మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బు, దర్పం ఉన్నా వాటికి ప్రయోజనం ఉండదు. చాలా మంది జీవితాలను ఎనిమిద కష్టాలు చుట్టుముడతాయి. వాటి నుంచి బయట పడాలంటే అష్ట లక్ష్మీలను కొలవాలని పండితులు చెబుతుంటారు. ఏ లక్ష్మీ ఎలాంటి కష్టం తీరుస్తుంది అనేది ముందుగా తెలుసు కోవాలి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్య లక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, ధన లక్ష్మి, విద్యాలక్ష్మి.

Ashtalaxmi sthothram
Ashtalaxmi sthothram

ఆదిలక్ష్మి :- సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

Advertisement

ధాన్యలక్ష్మి:- అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:- జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:- జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

Advertisement

సంతానలక్ష్మి:- అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:- జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:- ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

Advertisement

ధనలక్ష్మి:- ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

అష్టలక్ష్మీ స్తోత్రం” అనేది ఒక ప్రసిద్ధ ప్రార్థన. “జయ జయహే మధుసూదన కామిని .. ” అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఈ స్తోత్రాన్ని చదివితే.. అష్టకష్టాలు దూరం అవుతాయి.

Read Also : Goddess Laxmidevi : ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel