Apara ekadashi 2022 : అపర ఏకాదశి నాడు ఈ విధంగా పూజ చేస్తే… పట్టిందల్లా బంగారమే!

Updated on: May 25, 2022

Apara ekadashi 2022 : అపర ఏకాదశి నాడు ఉపవాసం పాటిస్తారు. ఈరోజున శ్రీ మహా విష్మువును అరాధించడం వల్ల ఆయన కృప మనపై ఉంటుందని భక్తుల నమ్మకం. అలాగే ఉపవాసం ఉండటం వల్ల పాపాలు, దుఃఖాలు, బాధలు పోయి మోక్షం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అయితే అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ముక్తి లభిస్తుంది. ఈ వ్రత కథ వింటే కూడా మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. హిందూ కాలెండర్ ప్రకారం… ఈ సంవత్సరం మే 25వ తేదీ అంటే ఉదయం 10.32 నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభం అయి మే 26వ తేదీ 10.54 వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి విశ్వాసం ప్రకారం గురువారం రోజు ఏకాదశి రాబోతుంది. కాబట్టి ఈ రోజంతా మీరు ఉపవాసం ఉండాలి. అయితే పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అపర ఏకాదశి వ్రతం, పూజా విధానం.. మే 25 దశమి రోజు నుంచి తామసిక వస్తువులను తినొద్ది. అంటే వెల్లల్లి, ఉల్లిపాయ, మాంసం అలాగే మద్యాన్ని మానుకోవాలి. మే 26 ఉదయమే తల స్నానం చేసి అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పుజాస్తానని ప్రతిజ్ఞ చేయండి. ఆ తర్వాత పూజా స్థలంలో ఒక పీఠంపై విష్ణువును ప్తరిష్టించండి. ఇప్పుడు శుభ ముహూర్తంలో విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయండి. పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలు, పండ్లు, అక్షతలు, చందనం, పసుపు, కుంకుమ, పంచామృతం, తులసి ఆకు, బెల్లం, తమలపాకులు, అరటి పండు, ధూపం, దీపం, సువాసన మొదలైన వాటిని శ్రీవారికి సమర్పించండి.

దీని తర్వాత విష్ణు చాలీసా, విష్ణు సహస్ర నామం, అపర ఏకాదశి కథ పారాయణం చేయండి. అప్పుడు విష్ణువు హారతితో పూజ ముగించండి. పూజానంతరం బ్రాహ్మణుడికి గోధుమలు, బెల్లం, పసుపు, పసుపు బట్టలు, పండ్లు మొదలైన వాటిని దానం చేయాలి. రోజంతా పండ్లను మాత్రమే తినాలి. అలాగే భక్తి స్తోత్రాలు చదవండి. రాత్రి సమయంలో భగవత్ జాగరణ చేయండి. భగవంతుని భక్తితో గడపండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ పూజ చేయాలి. పారాయణ సమయంలో ఆహారం తీసుకొని ఉపవాసాన్ని పూర్తి చేయండి. మీ కోరికలు నెరవేరాలని విష్ణువును ప్రార్థించండి.

Advertisement

Read Also : Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel