Shani Jayanthi : మన సనాతన ధర్మంలో దైవకార్యాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. మన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకుంటాము. ఇకపోతే చాలా మంది శనీశ్వరుడిని పూజించడం కోసం భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడిని పూజించడం వల్ల శని కలుగుతుందని భావించి చాలామంది శని దేవుడిని పూజించరు. అయితే శనీశ్వరుడు ఎవరి కర్మలకు తగ్గ వారికి ఫలితాలను మాత్రమే ఇస్తారు.
Shani Jayanthi
భక్తిశ్రద్ధలతో శనీశ్వరుని పూజించడం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగిపోయి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మరి శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన శని జయంతి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు పరిహారాలు చేయడం వల్ల శని అనుగ్రహం మనపై కలిగే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. మరి ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వచ్చింది శని జయంతి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ఏడాది శని జయంతి మే 30 2022, సోమవారం వచ్చింది. శుభ సమయం మే 29 ఆదివారం మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమవుతుంది. మే 30వ తేదీ సాయంత్రం 4:59 వరకు కొనసాగుతుంది. ఈరోజు శని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఏలినాటి శని తొలగిపోయి అన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి.
ఆవ నూనెతో పూజ: శని జయంతి రోజున ఉదయమే నిద్రలేచి ఆవ నూనెతో మర్దన చేసుకున్న అనంతరం స్నానం చేసి శనీశ్వరునికి ఇష్టమైన పంటలను ఆవనూనెతో సిద్ధం చేయాలి. అదేవిధంగా నువ్వుల నూనె, ఆవనూనెతో కలిపి దీపారాధన చేయాలి. అలాగే శనీశ్వరుని ఆలయానికి వెళ్లి ఆవనూనె సమర్పించి శని చాలీస చదవటం ఎంతో మంచిది.
రావి చెట్టుకు పూజ చేయటం: శనీశ్వరుని ఈతిబాధలు తొలగిపోవాలంటే జయంతి రోజున రావి చెట్టుకు పూజలు చేసిన అనంతరం పూజా ద్రవ్యాలను రావిచెట్టుకు సమర్పించి, ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి, శని దేవుడిని ప్రసన్నం కలుగుతుంది.
Read Also : Shani jayanthi : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం