Cough syrup : దగ్గు మందు సిరప్ తాగి 66 మంది చిన్నారులు మృతి, ఎక్కడంటే?

Updated on: October 6, 2022

Cough syrup : భారతదేశంలోని ప్రముఖ కంపెనీ తయారు చేసే దగ్గు, జలుబు సిరప్ ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ బుదవారం హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణించిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేశారు ఆరోగ్య నిపుణులు. ఢబ్ల్యూహెచ్ఓ తన వైద్య ఉత్పత్తుల ప్రయోగశాల పరీక్షల్లో ఈ సంస్థ ఉత్పత్తులైన దగ్గు, జలుబు సిరప్ లలో అధిక మొత్తం డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలో కనుగొనబడ్డాయని పేర్కొ్ంది. అవి పిల్లల ఆరోగ్యానికి మంచివి కావని, పిల్ల్లల్లో ఈ సిరప్ లు మూత్ర పిండాలను పాడు చేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారి తీస్తున్నాయని తెలిపింది.

WHO Alert on four indian cough syrups as 66 gambian kids died
WHO Alert on four indian cough syrups as 66 gambian kids died

డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో ఈ ఉత్పత్తి గురించి హెచ్చరిక జారీ చేసింది. వివాదాస్పద ఉత్పత్తులు గాంబియాలో ఇప్పటి వరకు కనుగొనబడ్డాయి. ఇప్పుడు దీన్ని ఇతర దేశాల్లో కూడా పంపిణీ చేయవచ్చచు. కనుక ఈ విషయంలో భారత ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత నెలలో గాంబియాలో 60 మంది పిల్లలు మరణించారు. ఈ చిన్నారులు తాగిన దగ్గు సిరప్ వల్లనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని… ముఖ్యంగా చిన్నారుల్లో కిడ్నీల సమస్య తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. చిన్నారుల మరణాలకు గల కారణాలపై ప్రభుత్వం ఈరా తీస్తోంది.

Read Also : Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తే.. భర్తలు చేసే పనులు ఏంటో తెలుసా? 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel