Acid Attack : దుర్వాసన వచ్చే చికెన్ అమ్ముతున్నాడంటూ యాసిడ్ దాడి..!

Acid Attack : ఉదయమే వచ్చి చికెన్ తీసుకెళ్లారు. ఇంటికెళ్లి రుచిగా కూర వండించుకున్నారు. కానీ తింటుంటే మాత్రం చికెన్ దుర్వాసన రావడం గుర్తించారు. అంతే దీనికంతటికి కారణం చికెన్ షాప్ యజమానే అంటూ ఆగ్రహంతో చికెన్ సెంటర్ వద్దకు వెళ్లారు. యజమానితో గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహానికి లోనై ఒక్కసారిగా యాసిడ్ తో దాడి చేశారు. షాప్ యజమానే కాదు.. అక్కడున్న మరో పది మందిపై కూడా యాసిడ్ దాడికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పట్టణానికి చెందిన హరీశ్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా.. సప్తగిరి కాలనీకి చెందిన పలువు చిరు వ్యాపారులు చికెన్ కొనుగోలు చేశారు. వంట చేశాక వాసన వస్తోందంటూ చికెన్ షాప్ యజమానితో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. చికెన్‌ షాప్‌ నిర్వాహకుడి సహా, అక్కడున్న మరికొందరిపై యాసిడ్‌తో దాడిచేశారు. ఈ ఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి… చికిత్స అందిస్తున్నారు.

Read Also : Krishna Tulsi Plant : ‘కృష్ణతులసి’ వేరుకు ఎంత పవర్ ఉందో తెలుసా.. జంటలు రాత్రుళ్లు అలసిపోవాల్సిందే..! 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel