Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

పుట్టింటికి వెళ్ళిన భార్య..అత్తపై దాడి చేసి చెవి కోసిన అల్లుడు..

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త పై కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం గాయపరిచాడు. ఈ ఘటన ఆదోని లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠగేరి కి చెందిన మాధవి.. నిజమొద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిసైన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక మాధవి తన భర్తను వదిలి ... Read more

By Ramesh Babu

Published on: January 12, 2022 5:20 PM

Updated on: January 12, 2022 5:15 PM

---Advertisement---

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త పై కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం గాయపరిచాడు. ఈ ఘటన ఆదోని లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠగేరి కి చెందిన మాధవి.. నిజమొద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిసైన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్ళింది.

భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్ కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమచెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్య పై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపులు విని ఇరుగు పొరుగువారు రావడంతో నరేష్ కుమార్ అక్కడి నుండి పరారయ్యాడు. అక్కడ జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా వివాహ సమయంలో తీసుకెళ్లిన ఎనిమిది లక్షల రూపాయలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడని మాధవి విలపించారు.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!