Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sad News: కన్న కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన తండ్రి… ఎక్కడంటే?

Sad News: సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే నలుగురు వ్యక్తులు కలిసి పాడి మోసుకొని తీసుకెళ్తాము లేదా శవాలను తరలించే వాహనాన్ని పిలిచి అంత్యక్రియలకు తీసుకెళ్తాము. కానీ

By Ramesh Babu

Published on: March 26, 2022 5:55 PM

Updated on: March 26, 2022 5:55 PM

---Advertisement---

Sad News: సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే నలుగురు వ్యక్తులు కలిసి పాడి మోసుకొని తీసుకెళ్తాము లేదా శవాలను తరలించే వాహనాన్ని పిలిచి అంత్యక్రియలకు తీసుకెళ్తాము. కానీ శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కన్న తండ్రి కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన చత్తీస్గడ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

pjimage 2022 03 26T175526.784అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్‌కు సురేఖ(7) అనే కూతురు ఉంది. గత నాలుగు రోజుల నుంచి సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధ పడటం వల్ల చికిత్స నిమిత్తం సురేఖను లఖాన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు శుక్రవారం తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు సురేఖను పరీక్షించిన అనంతరం తనకు ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సురేఖ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మరణించింది.

Advertisement

Advertisement

హెల్త్ సెంటర్ లోనే సురేఖ కన్నుమూయడంతో ఆస్పత్రి ఆవరణంలో శవాలను మోసుకెళ్లే వాహనం అందుబాటులో లేకుండా పోయింది. ఇక చేసేదేమిలేక ఈశ్వర్ తన కూతురు శవాన్ని 10 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్తూ గ్రామానికి చేరుకున్నారు.ఇలా ఈశ్వర్ తన బిడ్డ శవాన్ని భుజాలపై వేసుకుని వెళ్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియోపై చత్తీస్గడ్ ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ దియోకు కూడా చేరాయి. దీంతో మంత్రి తీవ్రంగా స్పందించి, విచారణకు ఆదేశించారు. బిడ్డను మోసుకెళ్తున్న ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, దీనికి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.