Fire Accident in Eluru : ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి!

Updated on: April 14, 2022

Fire Accident in Eluru : ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్ 4లో జరిగిన ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రికి తరలించే టప్పుడు మరో వ్యక్తి చనిపోయాడు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Fire Accident in Eluru
Fire Accident in Eluru

వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ.. ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోరస్‌ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.

Read Also : Jobs Notifications : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel