Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Dangerous Apps: పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ఈ యాప్స్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదం..!

Dangerous Apps: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఆ టెక్నాలజీ ఉపయోగించి మంచి పనులు చేయటం కన్నా సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి

By Ramesh Babu

Published on: April 12, 2022 4:15 PM

Updated on: April 12, 2022 4:15 PM

---Advertisement---

Dangerous Apps: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఆ టెక్నాలజీ ఉపయోగించి మంచి పనులు చేయటం కన్నా సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మన మొబైల్ ఫోన్ లో ఉన్న కొన్ని యాప్స్ ద్వారా కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటి గురించి అవగాహన లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

pjimage 2022 04 12T161647.263మన మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా మనం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుతో కలిగించడమే కాకుండా మన పర్సనల్ విషయాలను కూడా సేకరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో అటువంటి యాప్స్ కనిపించేలా హ్యాకర్లు చేస్తున్నారని, ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సంస్థ సూచిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా హ్యాకర్లు మన పర్సనల్ డేటాను ధరించడమే కాకుండా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బును కూడా లూటీ చేస్తున్నారు.

Advertisement

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం గూగుల్ నిషేధం విధించిన యాప్లు ఇప్పటికే 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయ్యాయని గూగుల్ సంస్థ వెల్లడించింది. ఈ యాప్స్ ఉపయోగించి ఫోన్ నెంబర్లు పాస్వర్డ్లు హ్యాక్ చేయడమే కాకుండా వాట్సాప్ కి సంబంధించిన డేటా ను కూడా యాక్సెస్ చేస్తున్నట్లు సమాచారం. గూగుల్ సంస్థ ద్వారా నిషేధించబడిన 10 యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేషన్ ఆడియో.(Full Quran MP3-50 Language & Translation)
2. హ్యాండ్ సెంట్ నెక్స్ట్SMS-టెక్స్ట్ విత్ ఎంఎంఎస్ (Handcent Next SMS- Text With MMS)
3. సింపుల్ వెదర్ అండ్ క్లాక్ విడ్జెట్ (Simple Weather & Clock Widget)
4. ఆడియోస్త్రాయిడ్ ఆడియో స్టూడియో DAW (Audiosdroid Audio Studio DAW)
5. Qibla కంపాస్ – రంజాన్ 2022 ( Qibla Compass – Ramadan 2022 ).
6. QR & బార్ కోడ్ స్కానర్ ( QR & Bar Code Scanner )
7. Wi-Fi మౌస్ (Remote Control PC )
8. Al – Moazin లైట్
9. స్పీడ్ రాడార్ కెమెరా (Speed Radar Camera )
10. స్మార్ట్ కిట్ 360 ( Smart Kit 360 )

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.