Crime News : మైనర్ బాలికపై 6 నెలలుగా లైంగిక దాడి… చివరకు ఎలా దొరికాడంటే !

Updated on: January 26, 2022

Crime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. పదమూడు సంవత్సరాల మైనర్ బాలికను ఓ కామ పిశాచి వలలో పడింది. ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి.

రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది.

Advertisement

ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు. ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : Technology News : బ్రౌజింగ్‌ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్‌… ఏంటంటే ?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel