Woman Murder: అందంగా ఉందని అనుమానం పెంచుకొని.. ఆపై కట్టుకున్న దాన్నే హత్య!

Woman Murder: అతని భార్య చాలా అందంగా ఉంటుంది. అదే ఆమె పాలిట శాపం అయింది. ఎవరికైనా అందంగా ఉన్న వాళ్లంటే పిచ్చి ఉంటుంది. కానీ అతడికి ఆమె అందంగా ఉంటే నచ్చలేదు. ఈ అందంమే వారిద్దరి మధ్యా అగాథాన్ని సృష్టించి ఆమె హత్యకు కారణం అయింది. అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ అనే వ్యక్తికి మాత్రం భార్య మరీ అందంగా ఉండటం నచ్చక.. అర్ధాంగిపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. డ్రైవర్ గా పని చేస్తున్న ఆసిఫ్, నాలగేళ్ల క్రితం కుటుంబాన్ని ఆశోక్ నగర్ కు మార్చాడు. పెళ్లి అయిన మొదట్లో షాహిన్ తో బాగానే ఉన్న భర్త తర్వాత మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచకున్నాడు.

ఎందుకు అందంగా తయారవుతున్నావు, ఎవరి కోసం అంటూ వేధించడం మొదలు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా వేదధించడం మొదలు పెట్టాడు. బిడ్డల కోసం ఇదంతా భరిస్తూ వచ్చిన ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం కుమారుడిని బయటకు పంపించి, కూతురు స్నానం చేసేందుకు వెళ్లగానే.. భార్యను కత్తితో నరికి చంపాడు. పదే పదే పొడుస్తూ.. అత్యంత దారుణంగా హత్య చేశాడు. స్థానికులంతా వచ్చే సరికి ఆమె రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే ఆసిఫ్ ఉన్నాడు. విషయం అర్థమై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel