Crime News: నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు… ఒక్కో కోర్సుకు ఒక్కో రేటు!

Updated on: February 15, 2022

Crime News: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్‌పేట్ – ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్ రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అలానే ముఠా సభ్యుల నుంచి ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంధర్భంగా దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.  పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ప్రతి డిగ్రీకి ఒక రేటు ఫిక్స్ చేశారు. కావాల్సిన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి… శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడు. టెలీకాలర్లు, ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారని వెల్లడించారు. బీటెక్ సర్టిఫికెట్ కు రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కు 1.7 లక్షలు, బీకాం సరిఫ్టికెట్ కు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు.

Advertisement

మధ్య ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సాయంతోనే ఈ దందా నడుస్తోంది. దీనిపై విచారణ చేస్తున్నాం. ఇక ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారు. నిందితుల నుండి రబ్బర్ స్టాంప్స్, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సీజ్ చేశాము. ఏడుగురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేశాం. ఇంకా హైదరాబాద్ లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలు ఉన్నట్లు గుర్తించాము. త్వరలోనే అరెస్ట్ చేస్తాము.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel