Missing News: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇలా?

Updated on: May 7, 2022

Missing News: ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యాయి.కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు అంగీకారం తెలిపి వారి దగ్గరుండి పెళ్లి చేయగా మరికొందరు పెద్దలు అంగీకారం తెలుపకపోవడంతో ప్రేమ వివాహాలు చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండగా మరి కొందరు గొడవలు పడి మనస్థాపంతో వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో మరొకటి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి స్ట్రీట్‌నెంబర్‌ 2లో నివాసం ఉండె సాయి కృష్ణ అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయికృష్ణకు మమత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరీ ప్రేమకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో గత రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా రెండు సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య తాజాగా మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఒక విషయం గురించి వీరిద్దరూ తీవ్రస్థాయిలో గొడవ పడినట్లు సమాచారం. అయితే తన భర్తతో గొడవ పడిన మమత మరుసటి రోజు ఉదయం డ్యూటీలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి తాను తన పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్లారు. ఇలా పుట్టింటికి వెళ్ళిన తన భార్యకు మరుసటి రోజు సాయి కృష్ణ ఫోన్ చేయగా తన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఈ క్రమంలోనే మమత చెల్లెలకు ఫోన్ చేసి ఆరా తీయగా తన అక్క తమ ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో భర్తతో గొడవ పడిన మమత ఎక్కడికి వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరా తీసిన పెద్దగా లాభం లేకపోయింది. ఈ క్రమంలోనే మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel