Murder: భర్త బద్ధకం భరించలేక భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు…!

Murder: సాధారణంగా భార్య భర్తలు అన్నాక అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్య భర్తలు ఎన్ని సార్లు గొడవపడ్డ కొంత కాలం తర్వాత గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ మాట్లాడుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో భార్య, భర్తలు ఇద్దరూ వారి గొడవను పెద్దది చేసుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసుకొనే వరకు వెళ్తారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా ప్రాణాలు తీసిన ఘటనలు కూడ తరచు మనం చూస్తుంటాము. అచ్చం ఇలాంటి ఘటన సెర్బియాలోని జ్రెంజనిన్‌లో చోటు చేసుకుంది.

సెర్బియాలోని జ్రెంజనిన్‌ కు చెందిన సర్జాన్ పెరిక్ (42), థెరెస్సా పెరిక్ (46) ఇద్దరు భార్యా భర్తలు. థెరెస్సాకు పెరిక్‌కు ఇంతకు మునుపే నాలుగురు భర్తలకి విడాకులు ఇచ్చి సర్జాన్ పెరిక్ ని వివాహం చేసుకుంది.ఇతడు ఐదో భర్త. ఈమెకు నలుగురు భర్తలతో నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి పెళ్లి జరిగిన రెండేళ్ళ వరకు వీరి కాపురం ఎంతో సజావుగా సాగింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న నగొడవలు మొదలయ్యాయి. సర్జాన్ పెరిక్ ఏ పని చేయకుండా ఎప్పుడూ బద్దకంగా పడుకొని ఉండేవాడు. ఈ కారణంగా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో మే 10 వ తేదీ రాత్రి సర్జాన్ నిద్రిస్తున్న సమయంలో అతని మీద కత్తితో దాడి చేసింది. సర్జన్ డ్రగ్స్ మత్తులో ఉండటం వల్ల అతడు తప్పించుకోవటానికి ప్రయత్నం చేసినా థెరిస్సా గట్టిగా పట్టుకొని.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది.

థెరిస్సా భర్తను చంపటం ఆమె కూతురు డి.ఎల్జే చుసి భయంతో తన అన్న వద్దకు పరుగులు తీసింది. థెరిస్సా సర్జన్ ని ముక్కలు ముక్కలుగా నరికి కూర వండింది. వీరి గొడవ గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకి సమచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారూ ఒక్కసారిగ షాక్ అయ్యారు. తన తల్లి హంతకురాలని డి.ఎల్జే పోలీసులకి చెప్పింది. దీంతో పోలిసులు ఆమెను అరెస్ట్ చేసారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel