Skeleton Mystery : ఆ అపార్ట్‌మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?

Skeleton Mystery : అదో పెద్ద అపార్ట్‌మెంట్.. అందులో ఓ నలుగురు సోదరుల కుటుంబం జీవిస్తోంది. తల్లి తన నలుగురు కొడుకులను అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అతడితో మరోచోట కలిసి ఉంటోంది. అంతకుముందు తన ప్రియుడితో కలిసి నలుగురు కుమారుల్లో ఒకరిని హత్యచేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు మిగతా పిల్లలను కూడా గాయపరిచింది.

అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. చనిపోయిన తమ సోదరుడితో కలిసి ఆ ముగ్గురు సోదరులు అదే అపార్ట్ మెంటులో ఉంటున్నారు. అస్థిపంజరంగా మారిన సోదరుడి అవశేషాలతోనే కలిసి జీవిస్తున్నారు. ఈ ఘటన టెక్సాస్‌‌లో హ్యస్టన్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. ఆమె తన భాగస్వామితో కలిసి ఆ కొడుకుని హత్య చేసిందనే అనుమానంతో టెక్సాస్‌ పోలీసులు తల్లిని అరెస్టు చేశారు.

తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మిగతా పిల్లలను గాయపరిచినట్లు అనుమానిస్తున్నారు. ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా కాలంగా ఉంటున్నారు. తల్లిదండ్రులూ లేకపోవడంతో ఆ పిల్లలు ముగ్గురు దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ముగ్గురి పిల్లలు తినేందుకు ఆహారం లేక పక్కంటి వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
Read Also : Pawan Death Note : అమ్మా.. నాన్న.. ఈ మొబైల్ అమ్మేసి.. నా అంత్యక్రియలు చేయండి..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel