Shanmukh Deepthi : షణ్ముక్, దీప్తి సునయన బ్రేకప్.. బిగ్‌బాస్ ఎంత పని చేసింది..?

Shanmukh Deepthi : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోల్చితే ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా జరిగింది. ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా హౌజ్‌లో బిహేవ్ చేశారు. సీజన్ ఫైవ్ విజేతగా వీజే సన్నీ నిలవగా, రన్నరప్‌గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచారు. కాగా, షణ్ముక్ జస్వంత్ హౌజ్ లో ఫ్రెండ్ షిప్ అంటూనే సిరి హన్మంత్ తో చేసిన చేష్టలపైన సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.

ఓ వైపు ఫ్రెండ్స్ అని చెప్తూనే ఇద్దరూ చాలా వింతగా వెగటు పుట్టేలా ప్రవర్తించారని సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్స్ చేశారు. ఫ్రెండ్లీ హగ్స్, కిస్సెస్, బెడ్ పైన దుప్పట్లో దూరిపోవడాలు, పక్క పక్కనే కూర్చోవడాలు.. దానికి తోడు షణ్ముక్ , సిరి మధ్య సంభాషణలు కూడా ప్రేమికుల మాదిరిగా ఉండటం చూసి ప్రతీ ఒక్కరు అరే.. ఏంట్రా ఇది.. అనుకునేంత సీన్ క్రియేట్ అయింది. చివరకు హౌజ్‌లో బిహేవియర్ వలన రియల్ లైఫ్‌లోనూ ఎఫెక్ట్ పడింది.

హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను దీప్తి సునయినను కలుస్తానని, బ్రేకప్ లాంటిది ఏం లేదని షణ్ముక్ జస్వంత్ చెప్పుకొచ్చాడు. కానీ, ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌లో సిరి, షణ్ణుల మధ్య క్లోజ్‌నెస్‌ చూసి.. దీప్తి సునయిన హార్ట్ బ్రేక్ అయిందట. ఈ క్రమంలోనే షణ్ముక్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసిందట.

Advertisement

అలా ఐదేళ్ల బంధానికి వంద రోజుల పాటు జరిగిన రియాలిటీ షో బ్రేకులు వేసిందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఇక సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా సిరికి కటీఫ్ చెప్పాలని ఆలోచిస్తున్నాడట. మొత్తంగా ఈ సీజన్ ఈ ఇద్దరు కంటెస్టెంట్స్‌కు వారి లైఫ్‌లో సాడ్ ఎండింగ్స్ వచ్చేలా చేసిందని చెప్పొచ్చు.

Read Also : Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ దగ్గర పుష్స కలెక్షన్ల సునామీ…! ఎన్ని కోట్లంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel