Technology News : టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ… మోసాలు కూడా పెరిగిపోయాయి.
మీరు కనుక గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా ? అయితే చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. ఇలాంటి మోసాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తోంది. అందుకే ఈ సైబర్ సేఫ్టీ టిప్స్ పాటించి మోసాలను అడ్డుకోవాలని సూచిస్తుంది…
- మోసగాళ్లు ముందుగా లాటరీ తగిలిందంటూ మెసేజెస్ పంపిస్తున్నారు. తాము పంపించే లింక్ క్లిక్ చేసి లాటరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని పొందొచ్చని ఆశ చూపిస్తున్నారు. వివరాలు ఎంటర్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలని నమ్మిస్తున్నారు. ఈ మోసాల గురించి తెలియనివారు సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా చేసి తమ అకౌంట్‌లోని డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు.
- మీ సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని మేం కొంటామని చెప్పి డబ్బులు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు నమ్మిస్తారు. డబ్బులు పంపాల్సింది పోయి యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపిస్తారు. ఈ మాటలు నమ్మి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీరు వారికి డబ్బులు పంపినట్టవుతుంది.
- మీ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. యూపీఐ లావాదేవీలు చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అవతలివారికి డబ్బులు పంపాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. అంతే తప్ప… మీకు డబ్బులు రావాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
- ఇక అలానే మీకు లాటరీ తగిలిందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తామని ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా అస్సలు నమ్మకూడదు.
- మీరు ఎట్టిపరిస్థితుల్లో మీ యూపీఐ పిన్ షేర్ చేయకూడదు.
- మీ యూపీఐ లావాదేవీలను నమ్మదగే ప్లాట్‌ఫామ్స్‌పైనే చేయాలి.
- పేమెంట్‌లో యూపీఐ ఆప్షన్ ఉందని కదా అని ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించకూడదు.
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.
- ఇక తరచూ మీ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి.
Read Also : Health Tips : పెరుగు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా… ఏంటంటే ?
Tufan9 Telugu News And Updates Breaking News All over World