Samsung Galaxy S24 Ultra 5G : వావ్.. అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్..

Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 12న ప్రైమ్ సభ్యులు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ధర రూ.74,999కి అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ అతిపెద్ద సేల్ ప్రైమ్ డే సేల్ జూలై 12 నుంచి (Amazon Prime Day Sale) ప్రారంభమైంది. 3 రోజుల షాపింగ్ ఈవెంట్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ డివైజ్‌లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ (Samsung Galaxy S24 Ultra 5G) సభ్యులకు మాత్రమే ప్రత్యేకమైనది. ముందస్తు డీల్స్, కొత్త లాంచ్‌లు, లిమిటెడ్ ఆఫర్‌లను కలిగి ఉంటుంది.

ఈ సేల్‌లో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘అతిపెద్ద డీల్ ఆఫ్ ది సేల్’ను వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G రూ.74,999 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది.

PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Samsung Galaxy S24 Ultra 5G ధర రూ.74,999 :

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా గత ఏడాదిలో రూ.1,34,999 (బేస్ మోడల్) ధరతో లాంచ్ అయింది.  అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day Sale Offers)లో ఈ హ్యాండ్‌సెట్ రూ.60వేల తగ్గింపుతో లభిస్తుంది. వినియోగదారులు రూ.74,999కి కొనుగోలు చేయొచ్చు.

Advertisement
Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G

అమెజాన్ ప్రైమ్ డే సేల్ బ్యాంక్ ఆఫర్లు :

  • ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్లపై 10శాతం ఆదా
  • SBI క్రెడిట్ కార్డులతో లావాదేవీలపై 10శాతం తగ్గింపు
  • ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులు, SBI క్రెడిట్ కార్డులపై 10శాతం EMI లావాదేవీలు
  • అమెజాన్ పే UPI యూజర్లకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.
  • Amazon Pay UPIతో ఫ్లాట్ రూ. 100 క్యాష్‌బ్యాక్ (కనీసం రూ. 1,000)
  • అమెజాన్ పే లేటర్ రూ. 60వేల వరకు ఇన్‌స్టంట్ క్రెడిట్, రూ. 600 వరకు విలువైన వెల్‌కమ్ గిఫ్ట్స్ పొందండి.

Samsung Galaxy S24 Ultra 5G ఫీచర్లు :

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ 6.8-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. చిన్ సహా చుట్టూ నారో బెజెల్స్‌తో 2600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. గెలాక్సీ S24 సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ గ్లాస్ అత్యంత మన్నికైనది. రిప్లక్షన్స్ 75శాతం తగ్గిస్తుంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన వ్యూను అందిస్తుంది. అదనంగా, డిస్‌ప్లే విజన్ బూస్టర్‌కు సపోర్టు ఇస్తుంది. 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Read Also : Acer Aspire Go 14 : స్టూడెంట్స్ కోసం కొత్త AI ల్యాప్‌టాప్‌.. అతి చౌకైన ధరకే ఏసర్ ఆస్పైర్ గో 14 కొనేసుకోండి!

Galaxy S24 Ultra ఫోన్ Snapdragon 8 Gen 3 మొబైల్ ప్లాట్‌ఫామ్, Galaxy AI సూట్ ద్వారా అడ్వాన్స్ AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5x ఆప్టికల్ జూమ్, OISతో కూడిన కొత్త 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. OISతో కూడిన 200MP ప్రైమరీ వైడ్ కెమెరా, OISతో కూడిన 10MP 3x టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం, డ్యూయల్-పిక్సెల్ 12MP సెన్సార్ ఉంది.

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UI 6.1పై రన్ అయ్యే గెలాక్సీ S24 అల్ట్రా 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు సపోర్టు ఇస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel